చేపల వేట కన్నా.. ఓటుహక్కే మిన్న..!

షియాల్ బేట్ గ్రామ సర్పంచ్ హమీర్ షియాల్ అక్కడి జనాలకు ఓటుహక్కు ప్రాధాన్యాన్ని చెప్పిన తర్వాత... ఆయన అభ్యర్థన మేరకు అప్పటికే వేటకు వెళ్లినవారు కూడా తిరిగివచ్చి పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయడం గమనార్హం. 

Last Updated : Dec 9, 2017, 03:07 PM IST
చేపల వేట కన్నా.. ఓటుహక్కే మిన్న..!

గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేగంగా జరుగుతున్న క్రమంలో..  అమ్రేలీ తీరంలోని షియాల్ బేట్ దీవిలో నివసిస్తున్న దాదాపు 4 వేలమంది మత్స్యకారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ జీవనోపాధి అయిన చేపలవేటకు ఈ రోజు సెలవును ప్రకటించి.. వారందరూ ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కి వచ్చారట.

వీరి కోసం ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఆ దీవిలో 5 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయడం విశేషం. షియాల్ బేట్ గ్రామ సర్పంచ్ హమీర్ షియాల్ అక్కడి జనాలకు ఓటుహక్కు ప్రాధాన్యాన్ని చెప్పిన తర్వాత... ఆయన అభ్యర్థన మేరకు అప్పటికే వేటకు వెళ్లినవారు కూడా తిరిగివచ్చి పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయడం గమనార్హం. దాదాపు 10000 జనాభా ఉన్న షియాల్ బేట్ ప్రాంతంలో నాలుగు వేలకు పైగానే ఓటర్లు ఉన్నారు. 

 

Trending News