గుజరాత్ పోల్స్‌లో ఈవీఎం రిగ్గింగ్: నకిలీ వార్త హల్చల్

గుజరాత్ పోల్స్ సందర్భంగా ఈవీఎం రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని.. అందుకే ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో అన్ని చోట్లా ప్రభుత్వం ఇంటర్నెట్ బంద్ చేస్తుందని పలు నకిలీ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని, వాటిని నమ్మవద్దని ఎన్నికల సంఘం ప్రజలకు తెలియజేసింది. 

Last Updated : Dec 18, 2017, 05:47 AM IST
గుజరాత్ పోల్స్‌లో ఈవీఎం రిగ్గింగ్: నకిలీ వార్త హల్చల్

గుజరాత్ పోల్స్ సందర్భంగా ఈవీఎం రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని.. అందుకే ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో అన్ని చోట్లా ప్రభుత్వం ఇంటర్నెట్ బంద్ చేస్తుందని పలు నకిలీ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని, వాటిని నమ్మవద్దని ఎన్నికల సంఘం ప్రజలకు తెలియజేసింది. గుజరాత్ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ బిబి స్వేన్ మాట్లాడుతూ తాము నకిలీ వార్తల్లో చెబుతున్నట్లుగా ఎలాంటి ఆర్డర్లు జారీ చేయలేదని చెప్పారు. రెండు రోజుల క్రితం రాజ్ కోట్ ప్రాంతంలో ఈసీ జారీ చేసినట్లు ఓ నకిలీ లెటర్ తయారుచేసి ఎవరో స్థానిక కలెక్టర్ ఆఫీసుకి పోస్టు చేశారు. లెటర్లు స్క్రుటినీ చేసే వ్యక్తి.. ఆ నకిలీ లెటరు నిజమేనని నమ్మి పై అధికారులకి పంపించడం జరిగింది. 

సోమవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో..ఈవీఎం రిగ్గింగ్ జరగకుండా ఉండేందుకు అంతర్జాల సేవలను కలెక్టర్ దగ్గరుండి బంద్ చేయించాలని ఆ లెటరులో ఉంది. పై అధికారులు కూడా ఆ లెటర్ తొలుత నిజమేనని నమ్మి.. ఆ తర్వాత నాలిక కరుచుకున్నారు. ఆ తర్వాత అదే లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే చిత్రమేంటంటే.. ఆ లెటర్ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ సంతకంతో జారీ చేసినట్లు ఉంది. కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చీఫ్ ఎలక్టారల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో భారత ఎన్నికల సంఘం మాత్రమే నిర్వహిస్తోంది. కనుక ఈ నకిలీ వార్తలను ప్రజలు నమ్మరాదని ఎన్నికల సంఘం తెలిపింది. 

Trending News