గుజరాత్ పోల్స్: మరికొద్ది సేపట్లో కౌంటింగ్ స్టార్ట్స్..!

గుజరాత్ రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లగాను జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం కల్లా వెలువడనున్నాయి. కౌంటింగ్ మాత్రం సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.

Last Updated : Dec 18, 2017, 07:17 AM IST
గుజరాత్ పోల్స్: మరికొద్ది సేపట్లో కౌంటింగ్ స్టార్ట్స్..!

గుజరాత్ రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లగాను జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం కల్లా వెలువడనున్నాయి. కౌంటింగ్ మాత్రం సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇటీవలే గుజరాత్‌లో జరిగిన ఎన్నికల్లో 68.41 శాతం పోలింగ్ రికార్డైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 18 డిసెంబరు 2017 తేదిన ఎన్నికల ఫలితాలు వెలువడతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

కౌంటింగ్ పూర్తయ్యాక, పూర్తి ఫలితాలను  www.eciresults.nic.in వెబ్‌సైటులో కూడా ఉంచుతామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ రోజు కాంగ్రెస్ అధికారపార్టీగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో ఈ ఎన్నికల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మనం కూడా అవలోకనం చేసుకుందాం

  • గుజరాత్ ఎన్నికల తొలిదశలో మొత్తం 977 అభ్యర్థులు పోటీ చేయగా, రెండవ దశలో దాదాపు 851 మంది అభ్యర్థులు  పోటీ చేశారు. 
  • గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం గుజరాత్‌లోని 33 జిల్లాల్లోని.. 37 సెంటర్లలో జరగనుంది
  • అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఇప్పటి వరకూ బిజేపీ పార్టీయే గెలుస్తుందని కరాకండిగా చెప్పడం గమనార్హం.
  • ఇరు పార్టీ భవితవ్యాలను మార్చేబోయే ఈ ఫలితాల్లో, ఎవరు 92 సీట్లు గెలుచుకుంటారో వారిదే అధికారం అని కచ్చితంగా చెప్పవచ్చు. 
  • గుజరాత్‌లో 2/3 సీట్లు గెలుచుకుంటామని ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ ప్రకటించారు.
  • గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని అబ్దశాలో ముస్లిం మెజారిటీ జనాభా అధిక శాతంలో ఉండడం విశేషం. అలాగే ముస్లిం జనాభా ఉన్న మరో అతిపెద్ద నియోజకవర్గం మాండ్వి. దాదాపు ఇక్కడ 50,000 ముస్లిములు,  31,000 దళితులు, 25,000 పటిదార్లు, 21,000 రాజ్‌పుత్‌లు ఉండడం గమనార్హం. అయితే 2012 ఎన్నికల్లో ఇదే మాండ్వి నుండి బీజేపీ నేత తారాచంద్ 61,984 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే.. ఈ ప్రాంతంలో ఇప్పుడు బీజేపీ వస్తుందా లేదా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. 
  • 2017 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు పలు నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్‌పీ,  జేడీయు, ఎన్సీపీ కూడా పోటీకి బరిలో దిగాయి.
  • గుజరాత్‌లో వరసగా ఆరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, రెండు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ వర్గాలు కూడా ఏదో మ్యాజిక్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. 
  • గుజరాత్ ఎన్నికల ఫలితాలే 2019 సార్వత్రిక ఎన్నికలపైనా పడే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా ఈ రోజే..!

  • హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు విషయంలో ఇప్పటికే భిన్నాభిప్రాయలు వస్తున్నాయి. ఒకవేళ బిజేపీ తన సత్తాను అక్కడ చాటితే.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ స్థానంలో బీజేపీ నేత ప్రేమ్ కుమార్ దుమాల్ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.
  • హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో కూడా బీజేపీ హవాయే కొనసాగుతుందని ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తెలపడం గమనార్హం
  • హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బరిలోకి దింపిన బీజేపీ అభ్యర్థుల్లో 14 మంది తొలిసారి పోటీ చేస్తుండగా.. 21 మందిని పార్టీ కొత్తగా పరిచయం చేస్తోంది.
  •  75% పైగా పోలింగ్‌ జరిగిన ఈ రాష్ట్రంలో 68 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును 42 కేంద్రాల్లో చేపట్టనున్నారు.

Trending News