గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కుక్కపిల్ల జోస్యం..!

గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సోమవారం చేపడుతున్న క్రమంలో ఓ చిత్రమైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది

Last Updated : Dec 16, 2017, 03:20 PM IST
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కుక్కపిల్ల జోస్యం..!

గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సోమవారం చేపడుతున్న క్రమంలో ఓ చిత్రమైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. భాజాపా నేత అమిత్ మాల్వియా ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియోలో ఓ యువతి చిన్న కుక్కపిల్లను ఎత్తుకొని  ‘మోదీ గుజరాత్‌ వస్తున్నారా’ అని అడగ్గా అది అవును అన్నట్లు చేతులు ఊపడం విశేషం.

అలాగే  ‘ రాహుల్ గుజరాత్‌ వస్తున్నారా’ అని ప్రశ్నించగా ఆ కుక్కపిల్ల మౌనంగా ఉండిపోవడం గమనార్హం. అయితే గుజరాత్‌లో బీజేపీ గెలుస్తుందన్న విషయానికి ఇది సూచకమని.. అలాగే కాంగ్రెస్ ఓడిపోతుందని కూడా ఈ కుక్కపిల్ల జోస్యం చెబుతోందని కొందరు అంటున్నారు. భాజాపా నేత అమిత్ మాల్వియా కూడా ఆ కుక్కపిల్లను ప్రశంసిస్తూ ‘ఈ బుజ్జిదానికి అన్నీ తెలుసు’ అని ట్వీట్ చేయడంతో ట్విట్టర్‌లో బీజేపీ అభిమానులు ఆనందాన్ని పంచుకుంటున్నారు.

 

Trending News