సొంత ఇలాకాలో క్యూలో నిల్చుని ఓటేసిన ప్రధాని మోదీ

గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Last Updated : Dec 14, 2017, 06:43 PM IST
సొంత ఇలాకాలో క్యూలో నిల్చుని ఓటేసిన ప్రధాని మోదీ

 గుజరాత్‌లో ఈ రోజు జరుగుతున్న రెండో దశ పోలింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సబర్మతిలో రానిప్ ప్రాంతంలోని 115వ పోలింగ్ బూత్‌లో క్యూ లైన్లో నిల్చుని మోదీ ఓటేశారు. ప్రధాని రాకతో సబర్మతిలో తీవ్ర సందడి నెలకొంది. స్థానిక కార్యకర్తలు ''మోదీ.. మోదీ..'' అంటూ బీజేపీ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేసిన సబర్మతి నియోజకవర్గం నుంచి బీజేపీ నేత అరవింద్ పటేల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్నారు. ఈసారి అరవింద్ పటేల్ పై కాంగ్రెస్ అగ్ర నేత జీతూ భాయ్ పటేల్ పోటీ చేస్తున్నారు. 

 

 

 

 

 

 

Trending News