ప్రధాని మోడీపై శివసేన ఫైర్

Last Updated : Dec 12, 2017, 01:02 PM IST
ప్రధాని మోడీపై శివసేన ఫైర్

ప్రధాని మోడీ మోదీపై శివసేన నిప్పులు చెరిగింది. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ తప్పుబట్టింది.  మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ..భారత రాజకీయ వ్యవస్థను చులకన చేస్తున్నారని ఆరోపించింది. దేశ రాజకీయాల స్థాయిని మోదీ దిగజార్చారని విమర్శించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ..ప్రధాని మోడీ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ఆరోపించింది. ప్రచార సభల్లో మోదీ తీవ్ర భావోద్వేగంతో, దూకుడుగా ప్రవర్తిస్తున్నారని... ఇదంతా బీజీపీ దిగజారుడు రాజకీయాలను సూచిస్తోందని ఎద్దేవ చేసింది. శివసేన తన పత్రిక సామ్నాలో ప్రధాని మోడీని విమర్శిస్తూ కథనాన్ని ప్రచురించింది.

Trending News