పావ్ బాజీ రుచికి "రాహుల్" ఫిదా..!

గుజరాత్‌లో జరిగిన ఒక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్.. తిరిగి వెళ్తూ దారిలో పావ్ బాజీ బండి దగ్గర ఆగడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.

Last Updated : Dec 8, 2017, 07:49 PM IST
పావ్ బాజీ రుచికి "రాహుల్" ఫిదా..!

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలోని స్థానిక  నియోజకవర్గాలన్నీ కూడా సందర్శిస్తున్న క్రమంలో ఈ రోజు ఆశ్చర్యకరమైన రీతిలో ఒక పావ్ బాజీ బండి దగ్గర ఆగారు. తన కార్యకర్తలతో కలిసి ఆ బండి దగ్గరకు వెళ్లి.. పావ్ బాజీ తిని.. ఆ రుచిని ఆస్వాదిస్తూ ఫిదా అయ్యారు. గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

ఆ ప్రాంతంలో జరిగిన ఒక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్.. తిరిగి వెళ్తూ దారిలో పావ్ బాజీ బండి దగ్గర ఆగడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ పావ్ బాజీ యజమాని కూడా ఒక క్షణం ఆశ్చర్యపోయి... అంతలోనే రాహుల్ బృందాన్ని ఆహ్వానించారు.

ప్రస్తుతం గుజరాత్‌లోని పవ్జేత్ పూర్, మొఘల్ దామ్ మందిర్, రనేసర్, తారాపూర్ మొదలైన ప్రాంతాలన్నీ సందర్శించాక రాహుల్ లింబసీ, లోతేశ్వర్ బాఘోల్ ప్రాంతాలకు వెళతారు. గుజరాత్ పోలింగ్‌కు సంబంధించి మొదటి విడత ఎన్నికలు రేపటి నుండి జరగనున్నాయి. రెండవ విడత ఎన్నికలు డిసెంబరు 14న జరగనున్నాయి. ఫలితాలను డిసెంబరు 18వ తేదీన ప్రకటిస్తారు. 

Trending News