Chandrababu Bought 5 Acre Land In Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు తన నివాసాన్ని కూడా రాజధాని ప్రాంతంలోనే నిర్మించుకోనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఐదెకరాలు భూమి కొనుగోలు చేశారని సమాచారం. ఆ భూమి ఎక్కడ.. ఎంత ధర తెలుసుకుందాం.
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు మూడు రాజధానులపై చర్చ జరుగుతుండగా తాజాగా తిరుపతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
CM Jagan : ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశాడు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతోన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే విశాఖలో బస చేయబోతోన్నట్టుగా తెలిపాడు.
Byreddy Siddharth Reddy At Rayalaseema Garjana: చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి.. రాయలసీమ ప్రజల గొంతును కోశారని వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ గర్జన సభలో మాట్లాడుతూ ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.
AP Capital: విశాఖ గర్జనకు ముందు మూడు రాజధానుల విషయంలో హాట్ కామెంట్స్ చేసిన సీనియర్ నేత, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఉద్యమం చేయడానికి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన మంత్రి ధర్మాన.. అన్నంత పని చేయడానికి సిద్దమయ్యారు.
Kodali Nani:కొడాలి నాని, టీడీపీ మధ్య వార్ లోకి తాజాగా తెలంగాణ మహిళా నేత వచ్చారు. కొడాలి నానిపై ఆమె తొడగొడుతున్నారు. తన అడ్డాగా చెప్పుకునే గుడివాడలోనే కొడాలి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
AP CAPITAL: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. అమరావతే రాజధాని అంటూ ఏడు నెలల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. హైకోర్టు తీర్పు పై ఇప్పుడు పిటిషన్ వేయడం చర్చగా మారింది
AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. గురువారమే అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చను చేపట్టింది ఏపీ ప్రభుత్వం. పాలనా వికేంద్రీకరమే తమ విధానమని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. ఈ సమావేశాల్లో జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.
AP CAPITAL: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం కానుందా? తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సిగ్నల్ ఇచ్చేసిందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.
AP HIGH COURT: మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే సైలెంట్ అయ్యారు కాని మూడు రాజధానుల విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది.
Andhra Pradesh Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్ లో వెల్లడించారు. అయితే రాజధాని ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వానికే హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.
Highcourt CJ on Amaravati: అమరావతి కేవలం రైతుల రాజధాని కాదని...ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) రాజధాని అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మాటల యుద్దం మరోసారి రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని సమరం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) బుధవారం కొట్టివేసింది.
ఓవైపు శాసనమండలి రద్దు దిశగా పావులు కదుపుతోన్న వైఎస్సార్ సీపీ సర్కార్.. రాజధాని అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని, పాలన ఎక్కడినుంచైనా చేయవచ్చునని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహణపై స్పష్టత వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సోమవారమే (జనవరి 20న) ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.