Kodali Nani: కొడాలి నానిపై తొడగొడుతున్న తెలంగాణ మహిళా నేత.. గుడివాడలో సంచలనమేనా?

Kodali Nani:కొడాలి నాని, టీడీపీ మధ్య వార్ లోకి తాజాగా తెలంగాణ మహిళా నేత వచ్చారు. కొడాలి నానిపై ఆమె తొడగొడుతున్నారు. తన అడ్డాగా చెప్పుకునే గుడివాడలోనే కొడాలి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.

Written by - Srisailam | Last Updated : Sep 20, 2022, 01:56 PM IST
Kodali Nani: కొడాలి నానిపై తొడగొడుతున్న తెలంగాణ మహిళా నేత.. గుడివాడలో సంచలనమేనా?

Kodali Nani: కొడాలి నాని.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్. గుడివాడ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొడాలి నాని. మొదటి రెండు సార్లు టీడీపీ నుంచి.. గత రెండు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొడాలిని తప్పించారు సీఎం జగన్. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను మొదటి నుంచి ఆయన ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తూ వచ్చారు. మంత్రిపదవిలో ఉన్నా చంద్రబాబు విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు నాని. అసెంబ్లీలోనూ నారా ఫ్యామిలినీ ఓ ఆటాడుకున్నారు. మంత్రి పదవి పోయినా ఆయన తీరు మాత్రం మారలేదు. జగన్ పై ఎవరూ విమర్శలు చేసినా వెంటనే సీన్ లోకి వచ్చి దులిపేస్తుంటారు కొడాలి నాని. చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తున్న కొడాలి నానిపై టీడీపీ నేతలు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు.

కొడాలి నాని, టీడీపీ మధ్య వార్ లోకి తాజాగా తెలంగాణ మహిళా నేత వచ్చారు. కొడాలి నానిపై ఆమె తొడగొడుతున్నారు. తన అడ్డాగా చెప్పుకునే గుడివాడలోనే కొడాలి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. కొడాలి కి సవాల్ విసిరిన మహిళా నేత కూడా ఫైర్ బ్రాండ్ లీడరే. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత , ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే గుడివాడలో పోటీ చేసి నాని సంగతి తేలుస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. గుడివాడలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. రేణుకా చౌదరిది కూడా ఆ సామాజిక వర్గమే. పైగా తనకు గుడివాడలో తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారంటున్నారు రేణుకా. గుడివాడలో పోటీ చేయాలంటూ తనకు ఆహ్వానాలు కూడా వస్తున్నాయన్నారు. గుడివాడలో పోటీ చేసి కొడాలి నానిని ఓడించి తీరుతానని చెబుతున్నారు రేణుకా చౌదరి.

రేణుకా చౌదరి ఏపీకి చెందినవారే. ఆమె విశాఖపట్నంలో జన్మించారు. హైదరాబాద్ లో రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. మొదట బంజారాహిల్స్ కార్పొరేటర్ గా ఆమె పొలిటికల్ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. అయితే పైర్ బ్రాండ్ లీడర్ గా ఆమె దూకుడుగా వెళ్లేవారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తో ఆమెకు విభేదాలు వచ్చాయి. ఎన్టీఆర్ ను సవాల్ చేసి బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే లోక్ సభకు ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆమె తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు రేణుకా చౌదరి. కాని కొంత కాలంగా ఏపీ రాజకీయాలపై ఆమె హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి విషయంలో జగన్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారుయ

అమరావతికి మద్దతుగా అక్కడి రైతులు అరసవెల్లి వరకు చేపట్టిన పాదయాత్రలో రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జగన్ కు పాలన చేతకాదని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే అధికాకరం నుంచి దిగిపోవాలని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని.. లేదంటే జగన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు రేణుకా చౌదరి. జగన్ పై చేసిన కామెంట్లకు రేణుకు కౌంటరిచ్చారు కొడాలి నాని. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా  ఏపీకి వచ్చి జగన్ ను ఓడిస్తానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. దీంతో తనపై కొడాలి చేసిన కామెంట్లకు కౌంటరిచ్చారు  రేణుకా చౌదరి. కొడాలి నానికి తన చరిత్ర తెలియదని, ఖమ్మం వస్తే చూపిస్తానని సవాల్ చేశారు. గుడివాడలో పోటీ చేసి తన బలం ఏంటో చూపిస్తానని చెప్పారు. రేణుక సవాళ్లు ఏపీలో చర్చగా మారాయి. గుడివాడలో ఆమె నిజంగానే పోటీ చేయబోతున్నారా? చేస్తే ఏం జరుగుతుందని అన్న చర్చ జనాల్లో సాగుతోంది. గుడివాడలో  రేణుకా చౌదరి పోటీ చేస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారడం ఖాయమని అంటున్నారు.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News