AP: అమరావతి విషయంలో చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మాటల యుద్దం మరోసారి రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని సమరం ప్రారంభమైంది.

Last Updated : Dec 17, 2020, 08:13 PM IST
AP: అమరావతి విషయంలో చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మాటల యుద్దం మరోసారి రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు వర్సెస్ కొడాలి నాని సమరం ప్రారంభమైంది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అమరావతి రాజధాని, మూడు రాజధానుల (Ap three capitals) విషయంలో చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu ), మంత్రి కొడాలి నాని ( Minister kodali nani ) ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు వేడెక్కిస్తున్నాయి. మూడు రాజధానులు లేదా అమరావతి విషయంలో రెఫరెండం ( Referendum )కు వెళ్తారా అని టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాలు విసిరారు. 80 శాతం మంది మూడు రాజధానులకు అంగీకరిస్తే..తాను రాజకీయాల్నించి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు చంద్రబాబు. 

చంద్రబాబు చేసి ఛాలెంజ్ పై మంత్రి కొడాలి నాని ( Minister kodali nani ) తీవ్రంగా స్పందించారు. అమరావతి విషయంలో చంద్రబాబుకు అంత నమ్మకముంటే..తాను, తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ప్రతి సవాల్ విసిరారు. ఒకవేళ చంద్రబాబు అండ్ కో గెలిచితే అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటుందని చెప్పారు మంత్రి కొడాలి నాని. 

గతంలో ఎన్టీఆర్ ( NTR )కు వెన్నుపోటు పొడిచినట్టే..చంద్రబాబు అమరావతి ( Amaravati )రైతులకు వెన్నుపోటు పొడిచారని కొడాలి నాని తెలిపారు. నకిలీ అమరావతిని సృష్టించి రైతుల్ని మోసం చేశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. 33 వేల ఎకరాల్ని దోచి..రైతుల్ని నట్టేట ముంచేశారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 

Also read: ISRO: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు

Trending News