AP HIGH COURT: త్వరలోనే కర్నూల్ కు ఏపీ హైకోర్టు.. కేంద్రంతో జగన్ సర్కార్ డీల్?

AP HIGH COURT: మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే సైలెంట్ అయ్యారు కాని మూడు రాజధానుల విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Jul 18, 2022, 02:46 PM IST
  • మళ్లీ తెరపైకి మూడు రాజధానులు
  • త్వరలో కర్నూల్ కు హైకోర్టు తరలింపు
  • జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి హామీ
AP HIGH COURT: త్వరలోనే కర్నూల్ కు ఏపీ హైకోర్టు.. కేంద్రంతో జగన్ సర్కార్ డీల్?

AP HIGH COURT: మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే సైలెంట్ అయ్యారు కాని మూడు రాజధానుల విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది. త్వరలోనే ఏపీకి సంబంధించి సంచలనం జరగబోతోందని తెలుస్తోంది. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం జరగనుంది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూల్ కు తరలించనున్నారని తెలుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. అయితే ఏపీకి సంబంధించిన పెండింగ్ సమస్యల సాధనకు రాష్ట్రపతి ఎన్నికలు మంచి అవకాశంగా ఉన్నా జగన్ సర్కార్ వినియోగించుకోలేదని..బీజేపీ అడగగానే మద్దతు ఇచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కేంద్రం మొడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్.. ఇంతమంచి అవకాశం వచ్చినా ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదనే టాక్ సామాన్య జనాల నుంచి వస్తోంది. ఏపీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి.. తన సొంత ప్రయోజనాలు, కేసుల మాఫీ కోసనే వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు వెనుక పెద్ద కథే నడిచిందనే వార్తలు వస్తున్నాయి.

ఏపీ హైకోర్టును కర్నూల్ కు తరలించాలని వైసీపీ షరతు పెట్టిందని.. అందుకు కేంద్రం పెద్దల నుంచి స్పష్టమైన హామీ లభించిందని అంటున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది బీజేపీ. రాయలసీమలో హైకోర్టు పెడతామన్నది అందులో ప్రధానమైంది. ఈ విషయాన్ని గుర్తు చేసి మరీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్ తరలింపునకు జగన్ ఓకే చేయించుకున్నారే టాక్ వస్తోంది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్ తరలించాలంటే కేంద్ర  న్యాయశాఖ నుంచే జరగాలి. ఇందుకు సంబంధించి పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతా ఈ సెషన్ లో జరగనుందని.. ఈ మేరకు వైసీపీకి కేంద్ర నుంచి పూర్తి హామీ వచ్చిందని చెబుతున్నారు. పార్లమెంట్ లో ప్రాసెస్ పూర్తైన తర్వాత
రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా దానికి ఆమోదముద్ర వేస్తారని అంటున్నారు.

ఏపీ హైకోర్టు కర్నూల్ కు తరలింపు ఖాయమనే ప్రచారం సాగుతుండగానే  విశాఖ జిల్లాకు చెందిన ఏపీ మంత్రి గుడివాడ అమరనాధ్ మరో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లుని త్వరలోనే  శాసనసభలో  పెట్టి ఆమోదింప చేస్తామని ప్రకటించారు.ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా ఎవరూ ఆపలేరన్నారు అమర్ నాథ్.తాజాగా జరుగుతున్న పరిణామాలతో మూడు రాజధానులపై జగన్ సర్కార్ మళ్లీ దూకుడు పెంచిందని తెలుస్తోంది. ముందుగా హైకోర్టుని కర్నూల్ కి తరలించి.. తర్వాత మిగితా తతంగం పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తం ఆగస్ట్ తరువాత ఏపీకి సంబంధించి సంచలన విషయాలు జరగబోతున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ మద్దతుతో కొత్త రాష్ట్రపతి కాబోతున్న ద్రౌపది ముర్ము తొలి సంతకం కర్నూల్ కి హైకోర్టు తరలింపు మీద పెడతారా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరీ ఏం జరగబోతోందో..

Read also: హిందీ సినిమాల్లో నటిస్తారా.. అల్లు అర్జున్ ఏం చెప్పారో తెలుసా? బన్నీది మాములు బుర్రకాదు

Read also: CM Jagan: వరద బాధితులకు తక్షణ సాయం అందించాలి..కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News