Chandrababu: రాజధాని అమరావతిలో సీఎం నివాసం.. 5 ఎకరాలు కొన్న చంద్రబాబు

Chandrababu Bought 5 Acre Land In Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు తన నివాసాన్ని కూడా రాజధాని ప్రాంతంలోనే నిర్మించుకోనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఐదెకరాలు భూమి కొనుగోలు చేశారని సమాచారం. ఆ భూమి ఎక్కడ.. ఎంత ధర తెలుసుకుందాం.

1 /6

రాజధానిపై దృష్టి: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని సీఎం చంద్రబాబు ప్రకటించి దాని అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

2 /6

అమరావతిలో నివాసం: రాజధాని అభివృద్ధికి కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు తన నివాసాన్ని కూడా రాజధాని ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నారు.

3 /6

ఐదెకరాలు: అమరావతి  పరిధిలో  సీఎం చంద్రబాబు వ్యక్తిగత వినియోగానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఈ భూమి ధర ఎంత అనే వివరాలు తెలియలేదు.

4 /6

వాటికి సమీపంలో: సీఎం చంద్రబాబు కొనుగోలు చేసిన ఈ భూమి జడ్జిల బంగ్లాలు, ఎన్జీవోల రెసిడెన్సీల సమీపంలో ఉంది.

5 /6

నివాసం: ఇంటి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పరిపాలన సౌలభ్యం కోసం ఇంటిని రాజధానిలో నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది.

6 /6

ప్రస్తుత నివాసం: ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి నివాసం చంద్రబాబు సొంతానిది కాదు. అద్దె ప్రాతిపదికన ఉంటున్నారని సమాచారం.