దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ (Former cm ysr) స్వప్నమైన త్రిబుల్ ఐటీ (IIIT) ల అభివృద్ధికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ( Ap cm ys jagan) సంకల్పించారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో ఉన్న త్రిపుల్ ఐటీలో 190 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్రిబుల్ ఐటీను పూర్తి స్థాయిలో తీర్దిదిద్దనున్నట్టు వైెఎస్ జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లో ఉద్యోగుల జీతాలకు ఇక లైన్ క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన ఆటంకాలు దీంతో తొలగిపోయాయి. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ( Ap Governor Vishwabhushan harichandan ) ..ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లుకు ( Ap Appropriation Bill ) ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైఎస్ ( ysr ) నాటి అంబులెన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆధునిక వసతులతో కూడిన 108, 104 వాహనాల్ని( 108, 104 services ) రేపట్నించి అందుబాటులో తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం 1088 అంబులెన్సులు రేపట్నించి ప్రారంభం కానున్నాయి. మరోవైపు అత్యాధునిక కోవిడ్ 19 బస్సులు ఇప్పటికే రాష్ట్రంలో సేవలందిస్తున్నాయి.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narsimha Rao centenary birth celebrations ) శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా పీవీ సేవల్ని కొనియాడారు.
Nimmagadda meeting with BJP leaders: అమరావతి: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kumar ) మరోసారి వివాదాస్పదమయ్యారు. బీజేపీ నేతలు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ అయిన వీడియో వెలుగులోకి రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది... అసలేం జరిగింది.
తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, మరికొందరు ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో తాజాగా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ప్రజా ప్రతినిధులలో ఇదే తొలి కరోనా కేసు కావడం గమనార్హం.
సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు సీఎం క్యాంపు కార్యాలయంలో (YSR Kapu Nestham) ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
AP CM YS Jagan meets Governor Biswabhushan: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వకంగానే సీఎం జగన్ గవర్నర్‌ను కలిశారు. ఈ భేటీకి ఇతర ప్రాధాన్యత ఏదీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా... కేబినెట్ మార్పు గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఏపీలో మరో కొత్త పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. నేడు వారి ఖాతాల్లోకి రూ.24వేలు జమ కానున్నాయి. YSR Nethanna Nestham
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే 60 వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో ప్రస్తుతం చేపడుతున్న సమగ్ర భూ సర్వే అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
‘కొందరి స్వార్థం కోసమే ఈ పనులు చేస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీ బాగు కోసమైతే, నన్ను పిలవక పోయినా వస్తాను. ఇండస్ట్రీ కోసం ఎన్నో చేశాను. ఇకపైనా చేస్తూనే ఉంటానని’ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna Comments) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలలో దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలోనూ భారత్‌లో అత్యుత్తమ సీఎంలలో నాలుగో స్థానం దక్కింది. కరోనా వైరస్ కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు వైఎస్ జగన్.
చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. కాగా ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో
గత రెండు నెలలకు పైగా లాక్ డౌన్ కారణంగా మూసివేయబడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు ద్వారాలు తేరుచుకోనున్నాయి. ప్రాథమికంగా ఉద్యోగులు, స్థానిక భక్తులతో తిరుమల ఆలయంలో
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (YS Jagan) ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వేయాల్సి వచ్చింది.
జగన్ అనే నేను..!! అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.