Ram Charan Apology: అయ్యప్ప మాలధారణ వేసిన సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ దర్గాను సందర్శించడం తీవ్ర దుమారం రేపుతోంది. మాలలో ఉండీ ఉర్సు ఉత్సవాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. చెర్రీ సతీమణి ఉపాసన దానిపై వివరణ ఇచ్చినా కూడా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని అయ్యప్పస్వామి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాల నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాయి.
Also Read: RAPO 22: రామ్ సరసన మిస్టర్ బచ్చన్ భామ.. అదిరిన కాంబినేషన్..
కడప నగరంలోని అమీన్పూర్ పెద్ద దర్గా ఉర్సు వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొనడం.. అక్కడ ప్రార్థనలు చేయడం తీవ్ర దుమారానికి తెర రేపింది. అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు రామ్ చరణ్ దర్గా సందర్శనను తప్పుబడుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) విలేకరుల సమావేశం నిర్వహించారు.
Also Read: Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
జేఏసీ నాయకులు గాంధీ కృష్ణ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 'అయ్యప్ప మాలధారణలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మెగా హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి మాల నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాకుండా దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమని స్పష్టం చేశారు. ధర్మాన్ని కాపాడతానంటూ ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం, రామ్ చరణ్ బాబాయి పవన్ కల్యాణ్ శ్రమిస్తుంటే అదే కుటుంబంలో జన్మించిన రామ్ చరణ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విచారకరమని పేర్కొన్నారు. రామ్‌చరణ్ బేషరత్‌గా అయ్యప్ప భక్తులకు, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్ధృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
🚨🚨 Ram Charan Dargah Visit Issue.
It’s high time lo leave Secularism. Watch & Repost 🙏 pic.twitter.com/b7yp0OP8vS
— Sanatana Traveller (@Sanatanatravelr) November 20, 2024
Today, Ram Charan visited a Dargah while observing the Ayyappa Swami Vratha and wearing the Ayyappa Swami Mala.
This is how majority of people in South India practice religion — Deeply devoted to their own faith while showing respect for others. ❤ pic.twitter.com/fxoN3AQC8w
— Veena Jain (@DrJain21) November 19, 2024
Faith unites, never divides
As Indians, we honor all paths to the divine 🙏 our strength lies in unity. 🇮🇳 #OneNationOneSpirit #jaihind @AlwaysRamCharan respecting other religions while following his own 🫡 pic.twitter.com/BdW58IEEF9
— Upasana Konidela (@upasanakonidela) November 19, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి