YSRCP ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. వారిలో తొలి కేసు

 తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, మరికొందరు ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో తాజాగా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ప్రజా ప్రతినిధులలో ఇదే తొలి కరోనా కేసు కావడం గమనార్హం.

Last Updated : Jun 23, 2020, 01:03 PM IST
YSRCP ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. వారిలో తొలి కేసు

విజయనగరం : కరోనా వైరస్(CoronaVirus)‌ మహమ్మారి సామాన్యులు, సెలబ్రిటీలు, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా కలకలం రేపుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు సైతం కోవిడ్19(COVID1-9) బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు కీలక నేతలకు కరోనా సోకగా.. తాజాగా ఏపీలో ప్రజా ప్రతినిధులలో తొలి కరోనా కేసు నమోదైంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ(YSRCP) నేత, శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు(MLA Srinivasa Rao)కు కోవిడ్19 బారిన పడ్డారు.  సీఎం వైఎస్ జగన్ మరో కొత్త పథకం

గత రెండు మూడు రోజులుగా స్వల్ప అనారోగ్యంతో ఉన్న శ్రీనివాసరావు కరోనా నేపథ్యంలో టెస్టులు చేపించుకోగా కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ఓ డిప్యూటీ ఎమ్మార్వో సైతం కరోనా బారిన పడ్డారు. ఏపీలో కరోనా ప్రవేశించిన చివరి జిల్లా విజయనగరం(CoronaVirus In Vizianagaram) కావడం గమనార్హం. విజయనగరం జిల్లాలోనూ కరోనా కేసులు భారీ సంఖ్యలోనే నమోదవుతున్నాయని తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News