AP: ఏపీలో జీతాల చెల్లింపుకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లో ఉద్యోగుల జీతాలకు ఇక లైన్ క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన ఆటంకాలు దీంతో తొలగిపోయాయి. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ( Ap Governor Vishwabhushan harichandan ) ..ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లుకు ( Ap Appropriation Bill )  ఆమోదం తెలిపారు.

Last Updated : Jul 2, 2020, 10:59 PM IST
AP: ఏపీలో జీతాల చెల్లింపుకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లో ఉద్యోగుల జీతాలకు ఇక లైన్ క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన ఆటంకాలు దీంతో తొలగిపోయాయి. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ( Ap Governor Vishwabhushan harichandan ) ..ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లుకు ( Ap Appropriation Bill )  ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఖర్చులు, ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే మండలిలో ఆమోదం పొందకుండా టీడీపీ( TDP) అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) అడ్డుకోవడంతో ఈ బిల్లు పెండింగ్ లో పడిపోయింది. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల్ని ప్రభుత్వం చెల్లించలేకపోయింది. నిబంధనల మేరకు మండలి ఆమోదించని బిల్లును 14 రోజుల తరువాత గవర్నర్ తన విచక్షణాధికారాలతో ఆమోదించవచ్చు. ఇప్పుడా గడువు ముగియడంతో ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖ జారీ చేసింది.  ముఖ్యమైన ఈ బిల్లు  ఆమోదం పొందడంతో ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు  విడుదల కానున్నాయి. Also read: AP: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ లాక్ 2: సడలింపులు ఇవే

Trending News