Sharmila: వైయస్ షర్మిల తన అన్న వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.అది కూడా గత కొన్నేళ్లుగా ప్రభాస్ తో తనకు ఏదో రిలేషన్ ఉందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కొన్ని దుష్ప్రచారాలు చేసారు. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రభాస్ ఎవడో నాకు తెలియదు. ఎపుడు పర్సనల్ గా కలిసింది లేదు. తనతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కుండ బద్దలు కొట్టింది. నా అన్న జగన్మోహన్ రెడ్డి తన సైతాను సైన్యంతో ప్రభాస్ తో నాకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేసారు. ఏ అన్న కూడా సొంత చెల్లిపై ఇంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయిస్తారా మండిపడ్డారు.
అమ్మ మీద కేసు పెడతారు. నాన్న పేరు సిబిఐ లో పెడతారు. ఇపుడు చెబుతున్నా.. జగన్ మోహన్ రెడ్డికి చెల్లె మీద ప్రేమ ఉంటె ఆ ఐదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు ఏం చేసావు. గాడిదలు కాసావా చెల్లెలు మీద ఇలాంటి ప్రచారం సాగితే అది తన మైలేజ్ కోసం వాడుకున్నాడు. తన మైలేజ్ కోసం చెల్లెలు పరువును బజారున పడేసాడంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది.
అయితే అప్పట్లో ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో అప్పటి కడప మేయర్.. వైయస్ రాజశేఖర్ రెడ్డి బామ్మర్ది.. విజయమ్మ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ‘యోగి’ సినిమాను నిర్మించారు. ఆ షూటింగ్ సమయంలో ప్రభాస్, షర్మిల కలుసుకున్నారనే పుకార్లు పుట్టించారు. అప్పటి నుంచి ప్రభాస్ కు, షర్మిలకు ఏదో లింకప్ చేస్తూ వార్తలను వండి వారుస్తూనే ఉన్నారు. దీనిపై ప్రభాస్ స్పందించింది లేదు. అటు షర్మిల కూడా తనకు ప్రభాస్ కు ఏదో రిలేషన్ ఉందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ చేసిన వీడియోలపై కోర్టులో కేసు వేసి ఆ యూట్యూబ్ వీడియోలను డిలీట్ చేయించారు. తాజాగా 2024 ఎన్నికల నేపథ్యంలో అన్నకు చెల్లికి చెడటంతో పాటు తాజాగా ప్రభాస్ తో ఎన్నో ఏళ్లుగా రిలేషన్ అంటగడుతున్న వారికి తన బిడ్డల మీద ప్రమాణం చేసి.. ప్రభాస్ తో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పి రాజకీయంగా కాక రేపింది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter