తండ్రికి తగ్గ తనయుడిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సంక్షేమ పథకాలలో దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలోనూ భారత్‌లో అత్యుత్తమ సీఎంలలో నాలుగో స్థానం దక్కింది. కరోనా వైరస్ (CoronaVirus) కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు వైఎస్ జగన్. నేడు సీఎం వైఎస్ జగన్ (YS Jagan) చేతుల మీదుగా వరుసగా 2వ ఏడాది #YSRVahanaMitra ఆర్థిక సాయం విడుదల కానుంది. కరోనా కల్లోలం.. ఏపీలో తాజాగా నలుగురు మృతి
కరోనా కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు 4 నెలల ముందుగానే వాహనమిత్ర కింద రూ. 10 వేలు అందజేత. 2,62,493 మంది లబ్ధిదారులకు రూ. 262.49 కోట్ల మేర ఆర్థిక సాయం లభించనుంది. గురువారం (జూన్ 4న) తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఒక్క బటన్ నొక్కి నేరుగా రూ.262.495 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్‌లైన్ చెల్లింపులు జరగనున్నాయి. గత ఏడాది కంటే 37,756 మందికి అదనంగా లబ్ధి చేకూరనుంది. మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్
కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్ నెలలో రూ.ప10 వేలు అందించాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో వారికి ఆపద కాలంలో ఆర్థిక భరోసా కోసం నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
జగన్ సర్కార్ శుభవార్త.. నేడు వారి ఖాతాల్లోకి రూ.10 వేలు