ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైఎస్ ( ysr ) నాటి అంబులెన్స్ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆధునిక వసతులతో కూడిన 108, 104 వాహనాల్ని( 108, 104 services ) రేపట్నించి అందుబాటులో తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం 1088 అంబులెన్సులు రేపట్నించి ప్రారంభం కానున్నాయి. మరోవైపు అత్యాధునిక కోవిడ్ 19 బస్సులు ఇప్పటికే రాష్ట్రంలో సేవలందిస్తున్నాయి.
108 వాహనాల పేరు వినగానే వైఎస్ ప్రభుత్వం గుర్తుకొస్తుంది. ఇప్పుడు మళ్లీ నాటి అవే సేవల్ని మరింత ఆధునికంగా అందించనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన మొత్తం 1088 అంబులెన్సుల్ని ( Hitech Ambulance ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) రేపు ప్రారంభించనున్నట్టు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ( Ap Health minister Alla Nani ) తెలిపారు. Also read: COVID-19 tests: దేశంలో ఏపీనే నెంబర్ 1
2 వందల కోట్ల రూపాయలతో కొత్తగా కొనుగోలు చేసిన 108, 104 వాహనాలు రాష్ట్రంలోని 676 మండలాల్లో అందుబాటులో రానున్నాయని మంత్రి స్పష్టం చేశారు. అర్బన్ పరిధిలో 15 నిమిషాల్లోనూ, రూరల్ పరిధిలో 20 నిమిషాల్లోనూ, ఏజెన్సీ పరిధిలో 25 నిమిషాల్లోనూ 108 వాహనం చేరుకునేలా టైమ్ మేనేజ్ మెంట్ వ్యవస్థ ఏర్పాటైందన్నారు. మొత్తం మూడు రకాలైన 108 వాహనాలు అందుబాటులో రావడమే కాకుండా...104 అడ్వాన్స్ సపోర్ట్ వాహనాలు ( Advance support vehicles ) 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు ( Basic life support vehicles ) 26 నియోనేటల్ సపోర్ట్ వాహనాల్ని ( neonatal support vehicles ) ప్రవేశపెడుతున్నట్టు మంత్రి నాని చెప్పారు. Also read: New districts in ap: ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. త్వరలోనే కీలక నిర్ణయం
బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాల్లో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్ ,బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వ్యవస్థ ఉంటుంది. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాల్లో క్రిటికల్ పరిస్తితుల్లో కూడా రోగిని ఆస్పత్రికి తీసుకొచ్చే క్రమంలో వైద్యసేవలందేలా వెంటిలేటర్ వ్యవస్థ ఏర్పాటైంది. ఇక నియేనేటల్ ఆంబులెన్సుల్లో ఇన్ క్యుబేటర్లతో ( Incubator ) పాటు వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. సకాలంలో వైద్యం అందక ఏ ఒక్క శిశువు కూడా మరణించకూడదనే ఉద్దేశ్యంతో ఇవి ఏర్పాటు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇక 104లో కూడా సమూల మార్పులు చేసి...మొబైల్ మెడికల్ యూనిట్లలా తీర్దిదిద్దారు. Also read : Nimmagadda Ramesh Kumar: బీజేపీ నేతలతో నిమ్మగడ్డ భేటీ వీడియో వైరల్.. రంగంలోకి దిగిన బీజేపి
ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తో అనుసంధానం చేయడం ద్వారా….ఫోన్ చేసిన వారిని వెంటనే ట్రాక్ చేసే వీలుంటుంది. ప్రతి అంబులెన్సులో ఓ కెమేరా, మొబైల్ డేటా టెర్మినల్ , మొబైల్ ఫోన్ లుంటాయి. రెండువైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమెటిక్ వెహికల్ లొకేషన్ టాండ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కోవిడ్ 19 బెంజ్ బస్సులు :
ఇవి కాకుండా ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభంతో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుందని మంత్రి చెప్పారు. దీని ప్రకారం రానున్న 90 రోజుల్లో ప్రతి ఇంటికీ కోవిడ్ 19 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు. వీటికోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధునిక కోవిడ్ 19 బెంజ్ బస్సుల్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసే క్రమంలో పూర్తి దూరం మెయింటైన్ చేసేలా...సంక్రమణను నివారించే విధంగా ఏర్పాట్లు చేశారు. Also read: India's first vaccine భారత తొలి వ్యాక్సీన్ కు అనుమతి…
రాష్ట్రంలో ఆరోగ్యవ్యవస్థలో ఈ కొత్త వాహనాల ద్వారా నూతన అధ్యాయం రానుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో అమలయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా ఉంటుందన్నారు.
ఏపీలో రేపట్నించి ఆధునిక అంబులెన్స్ లు ప్రారంభం