జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు

వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టారు. అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.10,000 జమకానున్నాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 10, 2020, 01:35 PM IST
జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు

రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ అన్నదమ్ములు,  అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న చేదోడు’ పథకాన్ని (Jagananna Chedhodu Scheme) ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ఆన్‌లైన్ విధానంలో ఈ పథకానికి సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,47,040 మంది లబ్ధిదారులకు రూ. 10,000 ఆర్థిక సాయం అందుతుంది. నేడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ. 247.04 కోట్లు జమ కానున్నాయి. నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) మాట్లాడారు. ‘తమ చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పధకాన్ని ప్రారంభిస్తున్నాం. కోవిడ్‌19 కష్టకాలం, లాక్‌డౌన్‌ సమయంలో వీరి కుటుంబాలు కష్టంగా బతుకుతున్న పరిస్ధితి చూశాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ మాట ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా, భగవద్గీతగా భావిస్తాను.  బాలీవుడ్ నటి టాప్ 10 Bikini Photos

నా పాదయాత్రలో చెప్పిన ప్రతీ హమీ అమలులో భాగంగా ఈ రోజు రజకులు, నాయీబ్రహ్మణ, దర్జీ వృత్తిలో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు నేడు ఈ హమీ అమలు చేయడం చాలా సంతోషాన్నిస్తుంది. పాత అప్పులకు ఈ డబ్బు జమ చేసుకోలేని విధంగా ఈ రూ.10 వేల నగదును వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం. మొత్తం రూ.247.04 కోట్లు 2,47,040 మంది లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి.

దీని కోసం ఇదివరకే గ్రామ వాలంటీర్లు, వార్డు సచివాలయాల ద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేశాం. నాకు ఓటు వేయని వారికి కూడా అర్హులైతే సంక్షేమ పథకాలు అందాలన్నదే నా లక్ష్యం. డబ్బు జమకాని అర్హులు కంగారు పడకుండా దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి నెల రోజుల్లో నగదు అందజేస్తామని’ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ ఏడాది రూ. 42, 465 కోట్ల నగదు దాదాపుగా 3.58 కోట్ల మంది లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేశామని వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News