అమరావతి: గత రెండు నెలలకు పైగా లాక్ డౌన్ కారణంగా మూసివేయబడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు ద్వారాలు తేరుచుకోనున్నాయి. ప్రాథమికంగా ఉద్యోగులు, స్థానిక భక్తులతో తిరుమల ఆలయంలో 'దర్శన్' ట్రయల్ రన్ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయ వ్యవహారాలను నిర్వహించే టీటీడీ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంగీకారంతో అనుమతి ఇచ్చింది.
Also Read: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి ప్రసాద్ జారీ చేసిన ప్రకటనలో టీటీడీ ఉద్యోగులు, తిరుమల స్థానిక ప్రజల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తుందని, పరిమిత సంఖ్యలో ప్రజలు అన్ని వేళల్లో 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది. కాగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి మే 12న లేఖ ద్వారా చేసిన అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
Also Read: Tamilnadu: తెరుచుకోనున్న సెలూన్లు.. ఆ కార్డు తప్పనిసరి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుండి ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవడానికి అనుమతించాలని ప్రతిపాదించబడిన నేపథ్యంలో టీటీడీ ట్రయిల్ రన్ నిర్వహిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి మార్గదర్శకాలను జారీ చేయకపోగా, ఇప్పటికీ ప్రజల అంతర్-రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలను కొనసాగిస్తోంది. టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్భారెడ్డి మాట్లాడుతూ భక్తులకు శ్రీవారి దర్శనం పున: ప్రారంభించడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని మే 20 న సుబ్బారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. చాలా ప్రాంతాల నుండి ఆలయం తెరుచుకోవడంపై ఇమెయిళ్ళు, ఫోన్లు వస్తున్నాయన్నారు.
ప్రతిరోజూ 50,000 నుండి లక్ష మంది యాత్రికులను దర్శించుకునే ఈ ఆలయానికి ప్రధాన ఆదాయ వనరులు '' హుండి''లో భక్తులు చేసే రోజువారీ సమర్పణలు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..