IPS RS Praveen Kumar applied for retirement: ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసే ఆఫీసర్‌గా పేరున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇవాళ తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
Teacher posts vacancies in Telangana: హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు పాఠశాలల్లో మొత్తం 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందజేసింది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో 10,657 పోస్టులు ఖాళీగా ఉండగా, సెకండరీ ఎడ్యుకేషన్‌లో 2,286 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా తొమ్మిదో రోజైన సోమవారం కూడా వెయ్యిలోపే కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం 1,03,398 మందికి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు (COVID-19 tests) చేశారు.
MLA Roja warns Telangana govt and ministers over KRMB issues: అమరావతి: తెలంగాణ సర్కారు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేయొద్దని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తిచేశారు. క్రిష్ణా రివర్ (Krishna river water row) నీటి వినియోగం విషయంలో తెలంగాణ మంత్రులు మళ్లీ ఆంధ్రా, తెలంగాణ మధ్య ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేసిన రోజా.. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రోజుకొక మాట మాట్లాడతారని ఆరోపించారు.
COVID-19 vaccination ahead of Corona third wave and Delta cases: హైదరాబాద్: రాష్టంలో కోటి మందికి కరోనా టీకాలు వేయడం పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆరోగ్య శాఖ అధికారులను, ఉద్యోగులను, క్షేత్రస్థాయి సిబ్బందిని, ఆశావర్కర్లను అభినందించారు. ఈ సందర్భంగా మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్‌ను (mobile vaccine vans) ప్రారంభించారు.
Delta plus variant cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క డెల్టా ప్లస్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి కానీ దేశంలో ఎక్కడో అక్కడొకటి అక్కడొకటి మినహా ఎక్కువగా ప్రభావం లేదని స్పష్టంచేశారు.
TS Inter second year results 2021: హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వెల్లడించే విధానానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఫస్ట్ ఇయర్లో వివిధ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్లో ఆయా సబ్జెక్టులకు కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
Golkonda bonalu festival: హైదరాబాద్: గోల్కొండ కోటలో జరిగే జగదాంబికా అమ్మవారి బోనాలు జూలై 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు దేవాదాయ శాఖ ఈఓ మహేందర్ కుమార్ తెలిపారు. ప్రతీ ఏడాది గోల్కొండ బోనాలతోనే రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు (Bonalu festival) ప్రారంభమవుతాయనే సంగతి తెలిసిందే.
Telangana unlock news updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గి పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో రాష్ట్రంలో జూన్ 20 నుంచి లాక్ డౌన్ ఎత్తివేయాలని నిన్న శనివారం జరిగిన కేబినెట్ భేటీలో (Telangana cabinet meeting) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,492 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. యథావిధిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 166 మందికి కరోనా సోకినట్టు ఈ పరీక్షల్లో నిర్ధారణ అయింది.
TS inter second year exams cancellation GO: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ జూన్ 9న సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
Rythu Bandhu Scheme 2021: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు కోటిన్నర ఎకరాల భూములకుగానూ రైతుబంధు సాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 15 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ కానుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Telangana COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శనివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గత 24 గంటల్లో 1,20,525 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారిలో 1,771 మందికి కరోనా సోకినట్టు తేలింది.
COVID-19 cases in Telangana: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. శుక్రవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,707 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది.
Heavy rains in telangana: హైదరాబాద్: రానున్న నాలుగు రోజులు పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఈ నెల 12, 13 తేదీల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ (Red alert) జారీచేసింది.
Telangana lockdown timings latest updates: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం నేటి నుంచి లాక్డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
TS inter second year exams cancelled, Sabitha Indra Reddy official statement: హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌పై నెలకొన్న సందిగ్ధానికి తెరదించుతూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేశారు.
TS Cabinet meeting points to know: హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని భేటీకి ముందు నెలకొన్న పలు సందేహాల్లో కొన్నింటికి సమాధానం లభించింది. లాక్డౌన్ పొడిగింపు, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, పెన్షనర్లకు బకాయిలు చెల్లింపు, నిరుపేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ డీలర్ల డిమాండ్ల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుతో పాటు పలు ఇతర కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
PRC approved for TS govt employees and pensioners: హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు (Govt employees and pensioners) ప్రయోజనం కలగనున్నట్టు తెలంగాణ సర్కారు తెలిపింది.
Free diagnostic tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో వైద్య సేవలు, వైద్య పరీక్షలు నిరుపేదలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించి ప్రజలకు డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతాధికారులను ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.