COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా తొమ్మిదో రోజైన సోమవారం కూడా వెయ్యిలోపే కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం 1,03,398 మందికి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు (COVID-19 tests) చేశారు. వారిలో 808 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మరో ఏడుగురు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Also read : Corona third wave: ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది ?
వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 1,061 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాలిటీ పరిధిలో (GHMC) 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 13 జిల్లాలో పదిలోపు కరోనా కేసులు (COVID-19 updates) నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
Also read: Bone Death Issue: పోస్ట్ కోవిడ్‌లో మరో సమస్య, కొత్తగా బోన్ డెత్‌ను గుర్తించిన వైద్యు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook