Hyderabad bonalu: గోల్కోండ బోనాలకు తేదీలు ఖరారు

Golkonda bonalu festival: హైదరాబాద్: గోల్కొండ కోటలో జరిగే జగదాంబికా అమ్మవారి బోనాలు జూలై 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు దేవాదాయ శాఖ ఈఓ మహేందర్ కుమార్ తెలిపారు. ప్రతీ ఏడాది గోల్కొండ బోనాలతోనే రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు (Bonalu festival) ప్రారంభమవుతాయనే సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2021, 06:24 AM IST
Hyderabad bonalu: గోల్కోండ బోనాలకు తేదీలు ఖరారు

Golkonda bonalu festival: హైదరాబాద్: గోల్కొండ కోటలో జరిగే జగదాంబికా అమ్మవారి బోనాలు జూలై 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు దేవాదాయ శాఖ ఈఓ మహేందర్ కుమార్ తెలిపారు. ప్రతీ ఏడాది గోల్కొండ బోనాలతోనే రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు (Bonalu festival) ప్రారంభమవుతాయనే సంగతి తెలిసిందే. నెల రోజుల పాటు జరిగే అమ్మవారి బోనాల వేడుకల్లో ప్రత్యేకంగా 9 ప్రత్యేక దినాల్లో 9 రకాల పూజలు నిర్వహిస్తారు. దేవాదాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం జులై 11న ఆదివారం లంగర్‌‌‌‌ హౌజ్‌‌లో అమ్మవారి భారీ తొట్టెలతో పాటు అమ్మవారి రథం, ఊరేగింపు కార్యక్రమంతో ఈ బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. 

జులై 15న రెండో పూజ, జులై 18న మూడో పూజ, జులై 22న నాలుగో పూజ, జులై 25న ఐదో పూజ, జులై 29న ఆరో పూజ, ఆగస్టు 1న ఏడో పూజ, ఆగస్టు 5న ఎనిమిదో పూజ, చివరిగా ముగింపు వేడుకల్లో భాగంగా ఆగస్టు 8వ తేదీన తొమ్మిదో పూజ నిర్వహిస్తారు. 

Also read : Rythu bandhu scheme money: పాత బకాయిల కింద రైతు బంధు.. స్పందించిన మంత్రి హరీష్ రావు, బ్యాంకులకు ఆదేశాలు

ఇదిలావుంటే, ఈ ఏడాది బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ (CM KCR)‌‌‌ ఆదేశించారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తలసాని (Minister Talasani Srinivas Yadav) వెల్లడించారు.

Also read: Addaguduru lockup death case: అడ్డగూడూరు లాకప్ డెత్ కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News