IPS RS Praveen Kumar resigns: ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

IPS RS Praveen Kumar applied for retirement: ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసే ఆఫీసర్‌గా పేరున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇవాళ తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2021, 06:38 PM IST
IPS RS Praveen Kumar resigns: ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

IPS RS Praveen Kumar applied for retirement: ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసే ఆఫీసర్‌గా పేరున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇవాళ తన ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్టు దరఖాస్తు చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. పుట్టిన గడ్డకు 26 ఏళ్ల పాటు సేవ చేసిన అనంతరం ఇవాళే తాను వాల్యుంటరీ రిటైర్మెంట్‌కి (IPS Praveen Kumar's resignation) దరఖాస్తు చేసినట్టు ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. 

తన 26 ఏళ్ల కెరీర్‌లో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ప్రవీణ్‌కుమార్‌... ఐపీఎస్‌గా పోలీస్‌ శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. మరింత సామాజిక సేవ కోసమే తాను పదవీ విరమణ చేస్తున్నట్టు ప్రకటించిన ప్రవీణ్ కుమార్ (IPS Praveen Kumar).. పూలే, అంబేద్కర్‌, కాన్షీరాం మార్గంలో నడుస్తానని వెల్లడించారు.

Trending News