Farmers protest against Minister Indrakaran Reddy: నిర్మల్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ జల్లా పొన్కల్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. శనివారం అక్కడ రైతు వేదిక ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌ని రైతులు, సాధర్మాట్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. Sadarmat barrage ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ నుంచి భూములు లాక్కుని మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తమకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు నిరసన వ్యక్తంచేశారు.
Minister Harish Rao comments on YS Sharmila's new party హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని.. రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి YS Sharmila చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది.
ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine)పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు.
CM KCR's health condition | హైదరాబాద్: సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్లో సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలు ముగిశాయి. సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలపై ఆయన వ్యక్తిగత వైద్యుడు డా. ఎం.వి. రావు స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరితిత్తుల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉందని డా. ఎం.వి. రావు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా నేటినుంచి రెండో విడత రైతుబంధు పథకం ప్రారంభం కానుంది. రైతుబంధు సాయాన్ని భూమి ఉన్న ప్రతీ ఒక్క రైతుకు అందించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
Non-agricultural properties | హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు సర్కార్ తెలిపింది.
Non-Agricultural properties registration | హైదరాబాద్: నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ఊపందుకోనుంది. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ని ఆదేశించినట్టుగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టా ( new parliament building ) ప్రాజెక్టుకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) శంకుస్థాపన చేయన్నారు.
రెండో విడత రైతుబంధు సాయం ప్రతీఒక్క రైతుకు అందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 7వ తేదీవరకు రైతుబంధు ( Rythu Bandhu Scheme) రెండో విడత ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చాలా మందికి అందించింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పూర్తి ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పలు చోట్ల బీజేపి ఆధిక్యం కనబర్చగా.. మరోవైపు సాధారణ ఓట్లలో పలు చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. ఇంకొన్ని స్థానాల్లో బీజేపి ఆధిక్యం కనబరుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల (GHMC Elections 2020) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముందుగా హోంమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు (GHMC Elections 2020) డిసెంబరు 1న జరగనున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM KCR On Corona Vaccine | కోవిడ్-19 టీకా పంపిణికి అంతా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. టీకా శాస్త్రీయంగా సిద్ధం అయితే దాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ వరద బాధితులకు అందించే వరద సాయాన్ని నిలిపేయాల్సిందిగా తాను ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ఒక పథకం ప్రకారమే ఫేక్ లెటర్ సృష్టించి తనను, బీజేపిని బద్నాం చేసేందుకు కుట్రపన్నిందని, ఆ లేఖపై ఉన్న సంతకం కూడా తనది కాదని బండి సంజయ్ తెలిపారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీకే చెందిన నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో రూ. 68 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని తెలంగాణ సర్కార్ చెప్పుకుంటోంది కానీ.. ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రభుత్వానికే సూటి ప్రశ్నలు సంధించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇటీవల భారీ వరదలు పోటెత్తిన కారణంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ సర్కార్ రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వరద సాయం కోసం నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న వరద బాధితులు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.