AP CM Jagan's Review Meeting on COVID-19 Cases: కొవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నందున ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా కొవిడ్ పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనావైరస్ లేటెస్ట్ వేరియంట్స్‌ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ ఆరా తీశారు. ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి..
Lockdown in India: దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తొలి దశలో ఏడు రోజుల పాటు లాక్ డౌన్ విధించి, గతంలో తరహాలోనే కఠినమైన ఆంక్షలు విధిస్తారనేది ఆ వైరల్ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ మెసేజ్ చూసి కొంతమంది జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Mock Drills In India: ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని నేరుగా పర్యవేక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాందవియ స్వయంగా ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. కరోనావైరస్కి చెక్ పెట్టేందుకు చేపట్టిన చర్యలో భాగంగానే భారత్ బయోటెక్ తయారు చేసిన నాజల్ కొవిడ్ వ్యాక్సిన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది.
COVID-19 Cases in AP: ఏపీలో కొవిడ్-19 వైరస్ ఇన్ఫెక్షన్ తాజా పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ స్పందించారు. కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ఏపీ సర్కారు అప్రమత్తంగా ఉందని.. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం అని జె. నివాస్ ప్రకటించారు.
Covid Vaccine for Children: మార్చి నుంచి 12-14 ఏళ్ల వయసు చిన్నారులకు కరోనా టీకా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. దీనిపై ఆరోగ్య శాఖ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. 15 - 18 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.
Lockdown in India 2022: కరోనా కేసులు మరోసారి దేశంలో భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ మూడో వేవ్ ప్రారంభమైన తరుణంలో మరోసారి లాక్ డౌన్ ప్రస్తావన వచ్చింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్రం లాక్ డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
Corona Cases Today: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 37,379 కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి మరో 124 మంది మరణించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నాయి.
Omicron Cases in Tamilnadu: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దేశంలో కొత్తగా 45 పాజిటివ్ కేసులు నిర్ధారణ అవ్వడం వల్ల మొత్తం 295 కేసులు నమోదయ్యాయి.
Breaking News, Second Omicron Case in AP: ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. ఇటీవలే కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన ఓ మహిళకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. అయితే ఆమె కుటుంబసభ్యులకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
West Indies Cricket Team Covid: వెస్టిండీస్ క్రికెట్ టీమ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాకిస్థాన్ పర్యటనలో ఉన్న విండీస్ జట్టులో మరో ముగ్గురు క్రికెటర్లు సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా సోకింది. కొవిడ్ బారిన పడిన వారిని ఐసోలేషన్ కు తరలించినట్లు వెస్టిండీస్ బోర్డు అధికారులు తెలిపారు.
COVID-19 cases in Telangana : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో తాజాగా 44,310 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. వారిలో 196 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 1543 మందికి సంబంధించిన కొవిడ్-19 రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 183 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,354 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 183 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Telangana High court slams Telangana govt: రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి విషయంలో ప్రస్తుత పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై కోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు (COVID-19 cases) పెరిగిపోతుండటం గమనించిన తర్వాతైనా మేలుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 68,097 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 298 మందికి కరోనా సోకినట్టు తేలింది.
Corona second wave in Telangana: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా 691 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ ఐదుగురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ర్టంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,721 కి చేరుకుంది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత కొద్దిరోజులుగా రోజువారీగా ఆరు వందలకు కాస్త అటుఇటుగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 746 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా తొమ్మిదో రోజైన సోమవారం కూడా వెయ్యిలోపే కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం 1,03,398 మందికి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు (COVID-19 tests) చేశారు.
COVID-19 updates from Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో 1,19,537 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యధావిధిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో (GHMC) అత్యధికంగా 137 కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.