TS Inter second year results 2021: హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వెల్లడించే విధానానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఫస్ట్ ఇయర్లో వివిధ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్లో ఆయా సబ్జెక్టులకు కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒకవేళ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో (TS Inter first year 2021 results) ఏమైనా బ్యాక్ లాగ్స్ ఉన్నట్టయితే.. వారిని సెకండ్ ఇయర్లో ఆ సబ్జెక్టులో 35 శాతం మార్కులతో పాస్ చేసేలా విధివిధానాలు రూపొందించారు. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్‌లో పూర్తి మార్కులు వేయనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది.
Also read : Telangana high court: Schools reopening పై తెలంగాణ సర్కారుకు హై కోర్టు ప్రశ్నలు
అయితే ఇంటర్ బోర్డు ప్రకటించనున్న ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు కరోనావైరస్ (COVID-19) తగ్గుముఖం పట్టి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మళ్లీ ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం కల్పించనున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది.
Also read: TS CETs schedules: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook