Pawan Kalyan Vs Revanth Reddy: పుష్ప 2 వ్యవహారంలో అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ ను తీరును తూర్పారా పట్డాడు. ఈ విషయమై అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. ఒక రకంగా రేవంత్ సర్కార్ తో ఢీ అంటే ఢీ అనడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. తాజాగా రేవంత్ రెడ్డి చేసినకామెంట్స్పై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణలో సినిమా పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. తాను అధికారంలో ఉన్నంతవరకు ప్రీమియర్ షోస్ ఉండవని, టికెట్ల ధరలు పెంచేది లేదని సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన పవన్‌కల్యాణ్ సినీ రంగంపై మాట్లాడారు.
గిరిజన ప్రాంతాల్లో చాలా సుందరమైన ప్రదేశాలున్నాయన్నారు. సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్‌లు చేయాలని సూచించారు. విదేశాల్లో ఉండే అందమైన ప్రదేశాలు గిరిజన, పల్లె ప్రాంతాల్లోనూ ఉంటాయని తెలిపారు. ఇటువంటి స్థలాల్లో షూటింగ్‌లు చేస్తే గిరిజనులకు ఉపాధి లభిస్తుందనన్నారు. పీకే వ్యాఖ్యలు చూస్తే బన్నీకి పుల్ సపోర్టు చేశాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ తన సినిమాల షూటింగ్స్ కోసం విదేశాలకు, మన దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే బదులు.. మన దగ్గరున్న ప్రాంతాల్లో షూటింగ్ చేస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.