Mobile COVID-19 vaccines vans: ఇక పని చేసే చోటికే మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్లు

COVID-19 vaccination ahead of Corona third wave and Delta cases: హైదరాబాద్: రాష్టంలో కోటి మందికి కరోనా టీకాలు వేయడం పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆరోగ్య శాఖ అధికారులను, ఉద్యోగులను, క్షేత్రస్థాయి సిబ్బందిని, ఆశావర్కర్లను అభినందించారు. ఈ సందర్భంగా మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్‌ను (mobile vaccine vans) ప్రారంభించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2021, 06:33 AM IST
Mobile COVID-19 vaccines vans: ఇక పని చేసే చోటికే మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్లు

COVID-19 vaccination ahead of Corona third wave and Delta cases: హైదరాబాద్: రాష్టంలో కోటి మందికి కరోనా టీకాలు వేయడం పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆరోగ్య శాఖ అధికారులను, ఉద్యోగులను, క్షేత్రస్థాయి సిబ్బందిని, ఆశావర్కర్లను అభినందించారు. ఈ సందర్భంగా మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్‌ను (mobile vaccine vans) ప్రారంభించారు. అదేవిధంగా వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ రూపొందించిన వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రజలందరు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (CS Somesh Kumar) మీడియాతో మాట్లాడుతూ నేడు చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా 1 కోటి మందికి టీకాలను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక పద్దతిలో ప్రణాళికాయుతంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో ప్రారంభించి హై రిస్క్ గ్రూపు, సూపర్ స్ప్రెడర్లను ముందస్తుగా గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వడం వలన సమర్ధవంతంగా కోవిడ్ వ్యాప్తిని అరికట్టగలిగినట్లు తెలిపారు.

Also read: AP Delta Plus Case: ఏపీకి పాకిన డెల్టా ప్లస్ వేరియంట్, స్పందించిన మంత్రి ఆళ్ల నాని

రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల మందికి కోవిడ్ టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయిస్తే, ఒక కోటి మైలురాయిని అధిగమించినట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. వారిలో  26 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కేటగిరిలలో మిగిలిపోయిన వ్యక్తులకు కోవిడ్ టీకాలు ఇచ్చుటకై 30 మొబైల్ వ్యాన్ల ద్వారా పని చేసే ప్రదేశాలలోనే టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆదే విధంగా త్వరలోనే విద్యా సంస్థలు ప్రారంభించనున్న (Schools and colleges reopening in Telangana) నేపథ్యంలో టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్న వ్యక్తులందరికి టీకాలు ఇచ్చు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ (IAS S.A.M Rizvi), మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.జి. శ్రీనివాస్ రావు, ఆరోగ్య శాఖ ఓ.ఎస్.డి.డా. టి గంగాధర్, TSMSIDC MD చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also read : Delta plus variant cases in Telangana: తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులుపై క్లారిటీ వచ్చింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News