Delta plus variant cases in Telangana: తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులుపై క్లారిటీ వచ్చింది

Delta plus variant cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క డెల్టా ప్లస్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి కానీ దేశంలో ఎక్కడో అక్కడొకటి అక్కడొకటి మినహా ఎక్కువగా ప్రభావం లేదని స్పష్టంచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2021, 07:11 AM IST
Delta plus variant cases in Telangana: తెలంగాణలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులుపై క్లారిటీ వచ్చింది

Delta plus variant cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క డెల్టా ప్లస్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి కానీ దేశంలో ఎక్కడో అక్కడొకటి అక్కడొకటి మినహా ఎక్కువగా ప్రభావం లేదని స్పష్టంచేశారు. 

Vaccination for 30 plus age group; 30 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్:
బుధవారం నుంచి 30 ఏళ్లు పైబడిన వయస్సు వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నామని శ్రీనివాస రావు తెలిపారు. స్కూల్స్, కాలేజీల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లు, ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ తమ ఐడీ కార్డులు, ఆధార్, కొవిన్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపించి వ్యాక్సిన్ తీసుకోవచ్చని అన్నారు. తెలంగాణకు జులై నెలకుగాను కేంద్రం 21 లక్షల టీకా డోస్‌లు (Vaccine doses) కేటాయించినట్టు చెప్పారు. 

Also read : Medical Posts 2021: మెడికల్ కాలేజీలకు 7007 పోస్టులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 97 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ (COVID-19 vaccination) కార్యక్రమం పూర్తయిందని అన్నారు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో కోటి మార్క్‌ని దాటుతుందని శ్రీనివాస రావు ధీమా వ్యక్తంచేశారు.

Also read : Telangana: కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆర్ధిక సహాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News