Teacher posts vacancies in Telangana: హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు పాఠశాలల్లో మొత్తం 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందజేసింది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో 10,657 పోస్టులు ఖాళీగా ఉండగా, సెకండరీ ఎడ్యుకేషన్‌లో 2,286 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎలిమెంటరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌లో కలిపి మొత్తం 1,38,517 పోస్టులు సాంక్షన్ కాగా.. అందులో ప్రస్తుతం 1,25,574 పోస్టులే భర్తీ అయి ఉన్నాయి. మిగతా 12,943 పోస్టులు వివిధ కారణాలతో ఖాళీగా ఉన్నాయి. స్టూడెంట్, టీచర్ రేషియో ప్రకారం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో 9,221 టీచర్ పోస్టులు (Teacher posts) ఎక్కువగా ఉన్నట్లు పీఏబీ నివేదిక స్పష్టంచేసింది.
Also read : OU VI semester exams schedule: ఓయూ సెమిస్టర్ పరీక్షలు షెడ్యూల్ ఖరారు
ఈ తేడాను కారణంగా చూపించి ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ (Teachers posts recruitment) చేయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 85 శాతం సెకండరీ స్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉన్నారని తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
Also read: Smartphones Price In India: రూ.20 వేలలో లభ్యమవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీరూ ఓ లుక్కేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Teacher posts in Telangana: తెలంగాణలో ఖాళీగా ఉన్న 12,943 టీచర్ పోస్టులు