Free diagnostic tests: తెలంగాణలో ఇకపై ఉచితంగా ఖరీదైన వైద్య పరీక్షలు: CM KCR

Free diagnostic tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో వైద్య సేవలు, వైద్య పరీక్షలు నిరుపేదలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించి ప్రజలకు డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతాధికారులను ఆదేశించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2021, 06:47 AM IST
Free diagnostic tests: తెలంగాణలో ఇకపై ఉచితంగా ఖరీదైన వైద్య పరీక్షలు: CM KCR

Free diagnostic tests in Telangana: హైదరాబాద్: తెలంగాణలో వైద్య సేవలు, వైద్య పరీక్షలు నిరుపేదలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించి ప్రజలకు డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతాధికారులను ఆదేశించారు. 

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 7న నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, అసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ములుగు, నల్గొండ, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లోని జిల్లా వైద్య కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా వైద్యాధికారులు (DMHOs) ప్రారంభించనున్నారు.

Also read : Telangana: పెరిగిన కరోనా పరీక్షలు.. తగ్గిన COVID-19 పాజిటివ్ కేసులు

ఏయే వైద్య పరీక్షలు లభిస్తాయంటే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలతో పాటు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బీపీ (How to check BP), షుగర్, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి జబ్బులకు సంబంధించిన పేషెంట్స్‌కి ఆయా వ్యాధులను నిర్దారించే ఎక్స్‌‌రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీకి సంబంధించిన పరీక్షలు చేస్తారని తెలిపారు. 

Also read : COVID-19 vaccine కి ముందు లేదా తర్వాత alcohol తీసుకోవచ్చా ? Side effects ఏంటి ?

ఖరీదైన వైద్య పరీక్షలు కూడా ఉచితం
సాధారణ వైద్య పరీక్షలే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో, ప్రైవేటు డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో (Govt free diagnostics centers) అత్యంత అరుదైన, ఖరీదైన వైద్య పరీక్షలను కూడా ఇక్కడ పూర్తి ఉచితంగా నిర్వహించి వెంటనే రిపోర్ట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ఈ పథకానికి ఒక మంచి పేరు పెడతామని సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టంచేశారు.

Also read : Anandayya mandu: ఆనందయ్య మందు వాడాను.. కరోనా రాలేదు: Jagapathi Babu

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News