Pooja hegde: నాజూకు అందాల సోయగం..నిజంగానే బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజిగా ఉన్న పూజా..నాగ్ చైతన్య సరసన థ్యాంక్యూ చెప్పబోతోంది. ఆ వివరాలేంటో చూద్దామా..
టాలీవుడ్ నటి పూజా హెగ్డే 2010లో మిస్ యూనివర్స్ పోటీలలో భారత్ నుంచి రెండో స్థానంలో నిలిచింది. వీరి నేపథ్యం కర్ణాటక కాగా, పూజా హెగ్డే పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. దీంతో త్వరగానే సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వర్కౌట్ ఫొటోస్ (Pooja Hegde Workout Photos) సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
చిన్న పిల్లలను పెద్దయ్యాక ఎమవుతావు.. అని అడిగితే ఎవరైనా సరే డాక్టర్.. ఇంజనీర్.. అంటూ చాలా క్యూట్‌గా సమధానం చెబుతుంటారు. అయితే ఓ చిన్నారి మాత్రం దీనికి భిన్నంగా నేను పెద్దయ్యాక పూజా హెగ్డేనవుతా (Actress Pooja Hegde ).. ఆమె మంచిగా ఉంటాది.. అంటూ.. చాలా క్యూట్‌గా ( child cute video ) మాట్లాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అయింది.
టాలీవుడ్లో అక్కినేని అఖిల్ ( Akhil Akkineni ) కి సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఎలాగైనా సరే ఈ సారి హిట్ కొట్టి చూపించాలని అఖిల్ తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ (bommarillu bhaskar) డైరెక్షన్లో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Happy Birthday Prabhas | టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ( Prabhas, Pooja Hegde ) జంటగా నటిస్తున్న 'రాధే శ్యామ్' మూవీకి సంబందించిన అప్డేట్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అక్టోబర్ 23 అనగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ ( Radheshyam motion poster ) విడుదల చేయనున్నారు. శనివారం ప్రభాస్ తన ఇన్‌స్టాలో "మోషన్ పోస్టర్ ద్వారా అక్టోబర్ 23న రాధే శ్యామ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి" అని ఓ పోస్టర్ షేర్ చేశాడు.
Singeetam Srinivasa Rao to join #Prabhas21 ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవ ద్వీపం వంటి క్లాసిక్ చిత్రాలతో దర్శక దిగ్గజంగా పేకు తెచ్చుకున్న ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు, ప్రభాస్ 21వ చిత్రం కోసం పని చేయనున్నారు. Nag Ashwin డైరెక్ట్ చేయబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు సింగీతం శ్రీనివాస రావు స్క్రిప్ట్ మెంటర్‌గా వ్యవహరించనున్నారు.
పూజా హెగ్డే టాలీవుడ్లో బ్యాక్-టు-బ్యాక్ హిట్ చిత్రాలు చేస్తూ ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్‌తో ( Allu Arjun ) పూజా చివరి చిత్రం, అల వైకుంఠపురములో.. ఇప్పటివరకు 2020లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
Prabhas ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో ( Radhe Shyam ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే ( Pooja Hegde ) జంటగా నటిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల తరువాత సెప్టెంబరు 2వ వారం నుంచి ఈ మూవీ తిరిగి షూటింగ్‌ని ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
సాహో ( Saaho ) చిత్రం తరువాత ప్రభాస్ ( Prabhas ) నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అభిమానులు విపరీతంగా ఆదరించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) సరసన బ్లాక్ బస్టర్ చిత్రం అల వైకుంఠపురములో నటించిన తరువాత పూజా హెగ్డే తన 9వ చిత్రం ప్రభాస్‌తో కలిసి రాదే శ్యామ్ మూవీలో నటిస్తోంది. అల వైకుంఠపురములో హిట్ అయిన తరువాత, టాలీవుడ్లో చాలా మంది దర్శకులు, నిర్మాతలు పూజా హెగ్డే ( Pooja Hegde ) డేట్స్ కోరుకుంటున్నారు.
Butta Bomma Song Record :అల్లు అర్జున్, పూజా హేగ్డే కాంబినేషన్లో వచ్చిన బుట్టబొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమాలోని ఈ పాట తెలుగు ప్రేక్షకులతో పాటు భారత దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కూడా ఫేవరిట్‌గా మారింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుత కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'అల వైకుంఠపురములో..' సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమైంది. టాలీవుడ్ కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.