Happy Birthday Prabhas: రాధేశ్యామ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది..

Happy Birthday Prabhas | టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు.

Last Updated : Oct 21, 2020, 12:48 PM IST
Happy Birthday Prabhas: రాధేశ్యామ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది..

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ (Radhe Shyam Movie) సర్‌ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్, పూజా హెగ్డే (Pooja Hegde In Radhe Shyam) జంటగా నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. జిల్ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయిన కెకె రాధాకృష్ణ కుమార్ ఈ 'రాధే శ్యామ్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 

సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు విక్రమాధిత్య అని రివీల్ చేసేలా ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలారు. విక్రమాధిత్యకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ముందుగానే పుట్టినరోజు కానుకను రాధేశ్యామ్ మూవీ యూనిట్ అందించింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ చాలా రాయల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మూవీ అప్‌డేట్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

 

 

ఈ ప్యాన్ ఇండియా మూవీకి జస్టిస్ ప్రభాకరన్ స్వరాలు సమకూరుస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ‘రాధేశ్యామ్’ మూవీ విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఇటీవల ఇటలీలో షూటింగ్ ప్రారంభమైంది. అయితే ప్రభాస్ పుట్టినరోజు నేపథ్యంలో రాధేశ్యామ్ మూవీ యూనిట్ ముందుగానే బర్త్‌డే సర్‌ప్రైజ్ అందించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News