Akhil Akkineni ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్ విడుదల

టాలీవుడ్‌లో అక్కినేని అఖిల్‌ ( Akhil Akkineni ) కి సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఎలాగైనా సరే ఈ సారి హిట్ కొట్టి చూపించాలని అఖిల్ తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ (bommarillu bhaskar) డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Last Updated : Oct 25, 2020, 03:04 PM IST
Akhil Akkineni ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్ విడుదల

Akhil Akkineni Movie Most Eligible Bachelor teaser release: టాలీవుడ్‌లో అక్కినేని అఖిల్‌ ( Akhil Akkineni ) కి సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఎలాగైనా సరే ఈ సారి హిట్ కొట్టి చూపించాలని అఖిల్ తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ (bommarillu bhaskar) డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చివరి దశలో ఆగిపోయింది. ఈ క్రమంలో ఇటీవలనే తిరిగి షూటింగ్‌ను ప్రారంభించిన చిత్ర బృందం వారం క్రితం ఈ సినిమాకి సంబంధించి ప్రీ టీజర్ వీడియోను ( Most eligible bachelor pre-teaser )  విడుదల చేసింది. ఇంతకుముందు ప్రకటించిన విధంగానే చిత్ర యూనిట్ దసరా పండుగ  ( Dussehra festival ) సందర్భంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ( Most eligible bachelor teaser ) సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేసింది. 

ఈ టీజర్‌లో అఖిల్ లుక్, యాక్టింగ్ ఆసక్తికరంగా ఆక‌ట్టుకునేలా ఉంది. మ్యారీడ్ లైఫ్ గురించి మీరేం ఎక్స్‌పెర్ట్ చేస్తున్నారంటూ.. అఖిల్ అడుగుతూ.. సరదాగా కనిపిస్తాడు. అయితే పూజా హెగ్డేతో అఖిల్ కెమిస్ట్రీ బాగుంద‌ని టీజ‌ర్‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. కామెడీ అండ్ రిస్క్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా ఈ విడుద‌ల చేయ‌నున్నారు మూవీ మేకర్స్. అయితే బన్నీ వాస్, వాసు వర్మ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ (Geetha Arts) ప్రజంట్ చేస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ గోపి సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. Also read: Pawan Kalyan 30వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసిందోచ్..

అయితే టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించిన పూజా హెగ్డే ( Actress Pooja Hegde ) ఈ సినిమాలో అఖిల్ సరసన జంటగా నటి స్తుండటంతో హిట్ పక్కా అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లక్కీ హీరోయిన్‌తోనైనా అఖిల్‌కి లక్ కలిసి వస్తుందో లేదో చూడాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.  

Most eligible bachelor teaser update: మ్యారేజ్ లైఫా.. అయ్యోయ్యోయ్యో అంటున్న అఖిల్

Also read: Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News