Radhe Shyam teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ వచ్చేనా ?

Radhe Shyam teaser expecting on Valentine’s Day: ప్రభాస్ అప్‌కమింగ్ మూవీస్ గురించి ప్రతీ వారం ఎప్పటికప్పుడు ఏదో ఒక అనౌన్స్‌మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందుకే ఎప్పుడు, ఏదో ఒక సినిమా అప్‌డేట్‌తో ప్రభాస్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు.

Last Updated : Feb 5, 2021, 05:59 PM IST
  • Radhe Shyam teaser కోసం వేచిచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.
  • రాధే శ్యామ్ టీజర్, మూవీ విడుదల తేదీలపై స్పందించని మూవీ యూనిట్.
  • రాధేశ్యామ్ గురించి క్లారిటీ ఇవ్వాల్సిందిగా ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్.
Radhe Shyam teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ వచ్చేనా ?

Radhe Shyam teaser expecting on Valentine’s Day: ప్రభాస్ అప్‌కమింగ్ మూవీస్ గురించి ప్రతీ వారం ఎప్పటికప్పుడు ఏదో ఒక అనౌన్స్‌మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందుకే ఎప్పుడు, ఏదో ఒక సినిమా అప్‌డేట్‌తో ప్రభాస్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. అలాగే తాజాగా రాధే శ్యామ్ మూవీ టీజర్ కూడా వార్తల్లో నిలుస్తూ ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఊరిస్తోంది. 

రాధేశ్యామ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది కానీ ఇప్పటివరకు విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నప్పటికీ.. ఇప్పటివరకు రాధే శ్యామ్ విడుదల తేదీని ప్రకటించకపోవడం Prabhas fans ని నిరాశకు గురిచేస్తోంది. దీంతో రాధే శ్యామ్ మూవీ రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌజ్ మాత్రం Radhe Shyam release date గురించి క్లారిటీ ఇవ్వడం లేదు.

ఈ కారణంగానే ప్రభాస్ అభిమానులు ప్రొడక్షన్ హౌజ్, అలాగే డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్‌లకు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో పలు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు చాలా రోజులుగా రాధే శ్యామ్ టీజర్ గురించి ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. మొదటిగా రాధే శ్యామ్ టీజర్ 2021, జనవరి 1న వస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. ఆ తరువాత సంక్రాంతి పండుగకైనా వస్తుందని అనుకున్నారు. కానీ చిత్ర బృందం నుండి ఎలాంటి స్పందన లేదు. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే రోజునైనా రాధేశ్యామ్ టీజర్ రాబోతోందని అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా కూడా ఒక Love story కావడంతో Radhe Shyam teaser ను రిలీజ్ చేయడానికి Valentines day సరైనదని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలాగైనా నిర్మాతలు తమ మొర ఆలకిస్తారేమేననేది వారి ఆశ. ఈ సినిమాలో Prabhas విక్రమాదిత్యగా, పూజ హెగ్డే ప్రేరణగా కనిపించనున్నారు.

Trending News