Radhe Shyam: కృష్ణాష్టమి రోజున సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన రాధేశ్యామ్‌ యూనిట్‌.. విక్రమాదిత్య, ప్రేరణల లుక్‌ అదుర్స్..

Radhe Shyam: ప్రభాస్‌ హీరోగా పూజాహెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలే ఉన్నాయి. ఈనేపథ్యంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చింది చిత్ర బృందం.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2021, 01:02 PM IST
Radhe Shyam: కృష్ణాష్టమి రోజున సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చిన రాధేశ్యామ్‌ యూనిట్‌.. విక్రమాదిత్య, ప్రేరణల లుక్‌ అదుర్స్..

Radhe Shyam Janmashtami Special: ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌.  కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా కృష్ణాష్టమి(krishnashtami) సందర్భంగా ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో ప్రభాస్‌(Prabhas), పూజా(Pooja Hedge)ల లుక్‌ ఆకట్టుకుంటుంది. దీంతో ‘రాధేశ్యామ్‌’ పోస్టర్‌(poster) అదిరిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

పాన్‌ ఇండియా(Pan India) స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను  గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్(UV Creation) బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్‌(Radhe Shyam) సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్‌ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు(Krishnam Raju) కీలక పాత్రలో కనిపించనున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ(Bhgya sri) కీలకపాత్రలో కనిపించనున్నారు.  ఈ భారీ బడ్జెట్‌ సినిమా 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ “సలార్”, “ఆదిపురుష్”, “ప్రాజెక్ట్ కే” వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు చిత్రాలు కూడా విభిన్నమైన జోనర్లో తెరకెక్కుతుండటం విశేషం.

Also Read: Sridevi Soda Center: శ్రీదేవి సోడా సెంటర్... వెండి తెరపై ఈ గోలి సోడా పేలుతుందా...?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News