Singeetam Srinivasa Rao: ప్రభాస్ సినిమాను గైడ్ చేయనున్న సింగీతం శ్రీనివాస రావు

Singeetam Srinivasa Rao to join #Prabhas21 ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవ ద్వీపం వంటి క్లాసిక్‌ చిత్రాలతో దర్శక దిగ్గజంగా పేకు తెచ్చుకున్న ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు, ప్రభాస్ 21వ చిత్రం కోసం పని చేయనున్నారు. Nag Ashwin డైరెక్ట్ చేయబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు సింగీతం శ్రీనివాస రావు స్క్రిప్ట్ మెంటర్‌గా వ్యవహరించనున్నారు.

Last Updated : Sep 21, 2020, 09:21 PM IST
  • ప్రభాస్ 21వ సినిమాకు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరించనున్న సింగీతం శ్రీనివాస రావు.
  • సింగీతం శ్రీనివాస రావు బర్త్ డే సందర్భంగా ఆ వివరాలు వెల్లడించిన చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.
  • నాగ్ అశ్విన్ - ప్రభాస్ చిత్రంపై పెరిగిన మరిన్ని భారీ అంచనాలు
Singeetam Srinivasa Rao: ప్రభాస్ సినిమాను గైడ్ చేయనున్న సింగీతం శ్రీనివాస రావు

Singeetam Srinivasa Rao to join #Prabhas21 ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవ ద్వీపం వంటి క్లాసిక్‌ చిత్రాలతో దర్శక దిగ్గజంగా పేకు తెచ్చుకున్న ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు, ప్రభాస్ 21వ చిత్రం ( #21Prabhas ) కోసం పని చేయనున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. 

Nag Ashwin డైరెక్ట్ చేయబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు సింగీతం శ్రీనివాస రావు స్క్రిప్ట్ మెంటర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే సింగీతం శ్రీనివాస రావు ( Singeetam Srinivasa Rao ) తన క్వారంటైన్ సమయాన్ని ఈ చిత్రం కోసం ఉపయోగించారు అని సింగీతం బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ వైజయంతి మూవీస్ వారు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. Also read : Nishabdham Trailer: అంచనాలు పెంచేస్తోన్న ‘నిశ్శబ్దం’ ట్రైలర్

 

ప్రభాస్ 21వ ప్యాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ ( Prabhas ) సరసన దీపికా పదుకొనే ( Deepika Padukone ) జోడి కడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్రం 'రాధే శ్యామ్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే ( Pooja Hegde ) జంటగా నటిస్తోంది. ఇదే కాకుండా ప్రభాస్ మరో ప్యాన్ ఇండియా చిత్రం అయిన 'ఆదిపురుష్'లో ( Adipurush movie ) శ్రీ రాముడి అవతారంలో కనిపించనున్నాడు అని తెలిసిందే. మొత్తానికి వరుస ప్యాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. 

బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) రావణుడి పాత్ర పోషించనుండగా లక్ష్మణుడు, హన్మంతుడి పాత్రల్లో కనిపించనున్న నటులు ఎవరనేది త్వరలోనే తేలనుంది. Also read : Renu Desai: మరలా కెమెరా ముందుకొస్తున్నా.. ఆశీర్వదించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News