Most Eligible Bachelor Movie: చిచ్చుబుడ్డి కాల్చిన అఖిల్, పూజా హెగ్డే

టాలీవుడ్‌ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ ( Akhil Akkineni ) ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ (bommarillu bhaskar) డైరెక్షన్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ను చకచకా పూర్తిచేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Last Updated : Nov 14, 2020, 08:57 AM IST
Most Eligible Bachelor Movie: చిచ్చుబుడ్డి కాల్చిన అఖిల్, పూజా హెగ్డే

Most Eligible Bachelor poster release: టాలీవుడ్‌ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ ( Akhil Akkineni ) ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ (bommarillu bhaskar) డైరెక్షన్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ను చకచకా పూర్తిచేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా.. చిత్రయూనిట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి సందర్భంగా.. అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అఖిల్, పూజా హెగ్డే ఇద్దరూ సరదగా కనిపించారు. పూజా హెగ్డే చిచ్చుబుడ్డి కాలుస్తుండగా.. అఖిల్ ఆమె చేతిని పట్టుకొని కనిపిస్తున్నాడు. Also read: Crack Movie: మాస్ మాహారాజా.. మాస్ బీట్ చూశారా..?

Most eligible bachelor

కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే బన్నీ వాస్, వాసు వర్మ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ (Geetha Arts) ప్రజెంట్ చేస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. 

Also read: Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక

Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Trending News