Acharya Movie: మరో మైలురాయి చేరుకున్న మెగాస్టార్ Chiranjeevi ఆచార్య సాంగ్

Laahe Laahe Song from Acharya Movie: కొరటాల శివ దర్శకత్వంతో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. మెగాస్టార్‌కు గతంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమా (Acharya Movie)కు స్వరాలు సమకూరుస్తున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 27, 2021, 12:40 PM IST
Acharya Movie: మరో మైలురాయి చేరుకున్న మెగాస్టార్ Chiranjeevi ఆచార్య సాంగ్

Laahe Laahe Song from Acharya Movie: కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఆచార్య. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలోనూ అసలు తగ్గడం లేదు. సినిమాలు విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేయడం ఆయనకు అలవాటే. తాజాగా ఆచార్య సినిమాతో తన మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేసేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. మరోవైపు కరోనా కేసులు తగ్గడంతో షూటింగ్స్ పునరుద్ధరించారు.

కొరటాల శివ దర్శకత్వంతో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. మెగాస్టార్‌కు గతంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమా (Acharya Movie)కు స్వరాలు సమకూరుస్తున్నాడు. అయితే చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆచార్య సినిమా పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఆచార్య సినిమా నుంచి ఇటీవల విడుదలైన లాహే లాహే లిరికల్ వీడియో సాంగ్ (Acharya Movie Laahe Laahe Lyrical Song) మరో మైలురాయి చేరుకుంది. 60 మిలియన్ల వ్యూస్ దాటి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి సత్తాను ఆచార్య మూవీ మరోసారి రుజువు చేసేలా ఉందని టాక్ వినిపిస్తోంది. 

Also Read: MAA Elections 2021: మా ఎన్నికల్లో నరేష్ కొత్త ప్రతిపాదన వర్కవుట్ అయ్యేనా

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోందని తెలిసిందే. వివాహం అనంతరం కాజల్ చేస్తున్న సినిమా ఇది. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే (Pooja Hegde In Acharya) జంటగా కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఇదివరకే విడుదలైన ఆచార్య టీజర్ (Acharya teaser), చిరంజీవి, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులను మెప్పించాయి. ఆచార్య సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Kathi Mahesh health condition: విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News