Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో చర్చలు జరపగా.. పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్నారు. మరోవైపు సీఎం జగన్ కూడా ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు.
AP Rajya Sabha Candidates: ఊహించినట్టుగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి కూడా పోటీ దిగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
Chandrababu met Amit Shah: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు పార్టీల కూటమికి మార్గం సుగమమౌతోంది. నిన్న అర్ధరాత్రి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena-Telugudesam: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జనంలో దూకుడుగా వెళ్తోంది. మరోవైపు జనసేన-తెలుగుదేశం సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.
TDp-Janasena Alliance: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం-జనసేన పొత్తు సర్దుబాటులో ఇంకా జరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల లెక్కపై సందిగ్దత కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sharmila Tour: వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపట్టాల్సిన జిల్లాల పర్యటన వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
AP Assembly Elections: ఎన్నికల సమయం దూసుకొస్తుండడం.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దూసుకెళ్తుండడంతో తెలుగుదేశం, జనసేన ఇప్పుడు సీట్ల పంపకాలపై సమావేశమైంది. పార్టీ అధినేతల భేటీలో జరిగిన చర్చల్లో సీట్ల పంచాయితీ ఇంకా తెగలేదు. పరిణామాలు చూస్తుంటే వారి మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది.
AP Politics: ఏపీ ఎన్నికలు సమీపించే కొద్దీ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైనాట్ 175 పేరుతో అభ్యర్ధులు మార్పులు, చేర్పులు ఆ పార్టీకు కీలక నేతల్ని దూరం చేస్తోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉన్నట్టు సమాచారం.
Konda Surekha Enters in AP Politics: ఏపీ సీఎం జగన్‌ను ఇప్పటికే ఇద్దరు చెల్లెళ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా వారిద్దరికీ ఇప్పుడు మరొకరు తోడయ్యారు. ఇప్పుడు జగన్‌ను చెడుగుడు ఆడేందుకు తెలంగాణ అక్క రాబోతున్నది. ఉమ్మడి ఏపీలో జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచిన అక్కడ ఇప్పుడు ఏపీలో అతడికే వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆమె ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు.
Sharmila Kadapa Tour: రాజకీయంగా వైఎస్ షర్మిల సరికొత్తగా పావులు కదుపుతున్నారు. తన సోదరుడు, సీఎం జగనే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా సొంత జిల్లా కడపలో షర్మిల పర్యటించడంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి.
Janasena: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో కొన్ని నెలలు మాత్రమే మిగిలి వుంది. దీంతో రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులతో పాటు తమ వ్యూహ చతురతకు పదను పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయా పార్టీల్లో చేరి తమ సీటును పదిలం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు.
Sharmila Anantapur Tour: ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఏపీ కోసం ఎంతదాకైనా పోరాడుతానని, తన కుటుంబాన్ని చీల్చినా వెనుకాడనని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల అనంతపురంలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు.
Minister Roja: మినిస్టర్ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజా అక్కడ సత్తా చాటింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఈమె తాజాగా ఇపుడు ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ షర్మిల కేంద్రంగా మారాయి. షర్మిల వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై వైఎస్ షర్మిల స్పందించారు. తన కుటుంబంపై తప్పుడు నిందలు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనలో ప్రవహించేది వైఎస్సార్ రక్తమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ప్రజలు, బీజేపీ దేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు.
AP Politics: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో సీట్లు దక్కని నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన యువ నేత భరత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
Glass Symbol Allott: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీపై దూకుడుగా వెళ్తున్న జనసేనకు ఒకేరోజు డబుల్ బొనాంజా తగిలింది. పార్టీలోకి సినీ ప్రముఖులు జానీ మాస్టర్, పృథ్వీరాజ్ చేరగా.. ఇదే రోజు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును తిరిగి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరిణామాలతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.