AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ షర్మిల కేంద్రంగా మారాయి. షర్మిల వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై వైఎస్ షర్మిల స్పందించారు. తన కుటుంబంపై తప్పుడు నిందలు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనలో ప్రవహించేది వైఎస్సార్ రక్తమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ప్రజలు, బీజేపీ దేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు.
AP Politics: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో సీట్లు దక్కని నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన యువ నేత భరత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
Glass Symbol Allott: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీపై దూకుడుగా వెళ్తున్న జనసేనకు ఒకేరోజు డబుల్ బొనాంజా తగిలింది. పార్టీలోకి సినీ ప్రముఖులు జానీ మాస్టర్, పృథ్వీరాజ్ చేరగా.. ఇదే రోజు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును తిరిగి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరిణామాలతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sharmila AP Tour: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునః ప్రవేశించిన వైఎస్ షర్మిల తన సొంత అన్న సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విమర్శల దాడి పెంచారు. సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న షర్మిల విశాఖపట్టణం పర్యటనలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Sensational Comments: రాజకీయాల్లోకి ప్రవేశించిన తన సోదరి షర్మిలపై తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆమె పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జాకీలు పెట్టి లేపేందుకు చాలా మంది వస్తున్నారని విమర్శలు చేశారు. తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని స్పష్టం చేశారు.
Balineni vs Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని వాసు వ్యవహారం కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చల అనంతరం బాలినేని విషయంలో క్లారిటీ వచ్చింది. ఇక త్వరలోనే నాలుగో జాబితా విడుదలకానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TDP-Janasena Manifesto: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లను ప్రకటిస్తుంటే మరోవైపు టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రూకల్పనలో నిమగ్నమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓ వైపు వైనాట్ 175 లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేర్పులతో జాబితాలు విడుదల చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysrcp 3rd List: వైనాట్ 175 లక్ష్యంగా భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మూడో జాబితాకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే మూడో జాబితా దాదాపుగా కొలిక్కి వచ్చేసింది. ఇవాళ లేదా రేపు మూడో జాబితా విడుదల కానుంది.
Rajyasabha Elections 2024: ఓ వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలు. ఏపీలో అధికార, విపక్షాలకు కత్తీమీదసామే. మూడు స్థానాల అభ్యర్ధుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆ ముగ్గురు ఎవరంటే..
AP Politics: వైసీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరగా.. మరో ఎమ్మెల్సీ జనసేన పార్టీలో చేరారు.
VV Vinayak: ఏపీలో ఎన్నికల సమయం సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భారీగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మారుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త లెక్కలు అంతుబట్టకుండా ఉంటున్నాయి. మరోవైపు కొందరు ప్రముఖులు వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమౌతున్నారు.
YCP Second List: వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమూల మార్పులు చేస్తోంది. చాలా స్థానాల్లో మార్పులు చేస్తోంది. ఇవాళ 27 మంది అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysrcp Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తెలుగుదేశం-జనసేన పొత్తు, వైసీపీ వైనాట్ 175 టార్గెట్ నేపధ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కోస్తా జిల్లాల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన ఆ సామాజికవర్గంపై అధికార పార్టీ ఇప్పుడు దృష్టి సారించింది.
Minister Gudivada Amarnath: చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే.. ఆయన కుటుంబ సభ్యులు తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. నారా లోకేష్ విహార యాత్రకు వెళ్లగా.. బాలయ్య సినిమా రిలీజ్ సందడిలో ఉన్నారని విమర్శించారు.
Jagananna Aarogya suraksha Scheme Benefits: జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయబోతున్నామని... ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటినీ, జల్లెడ పట్టి, ఏ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేటట్టుగా, వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం జగన్ ప్రకటించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని తెలుగు దేశం పార్టీ తప్పుపట్టడాన్ని ప్రస్తావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. అవినీతికి పాల్పడిన వారిపై, తప్పు చేసిన వారిపై కేసులు పెట్టడం కక్ష్య సాధింపు చర్యలు కానే కాదు అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.