APCC Sharmila Tour: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తన సోదరుడైన సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే జగన్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న షర్మిల తదుపరి కార్యాచరణ భారీగా ప్లాన్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి ఐదు జిల్లాల రోడ్ షోకు కార్యాచరణ ప్రకటించగా.. తాజాగా ఆ పర్యటన వాయిదా పడింది. షర్మిల జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది.
Also Read: TDP JSP Seats: కొలిక్కి రాని సీట్ల 'పంచాయితీ'.. టీడీపీ జనసేన పొత్తు కొనసాగేనా?
వరుస పర్యటనతో అలసట
వరుస పర్యటనలతో బిజీబిజీగా ఉండడంతో షర్మిల అలసిపోయారు. దీనికితోడు ఢిల్లీలోని చలి తీవ్రతను ఆమె తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఆమె వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. వైద్యుల సూచన మేరకు షర్మిల రెండు రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. అనారోగ్యం నేపథ్యంలో ఐదు రోజులపాటు ఏడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు, రచ్చబండ, రోడ్ షోలను తాత్కాలిక వాయిదా వేశారు. విశ్రాంతి అనంతరం ఈ నెల 7వ తేదీన బాపట్ల బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Also Read: Indian Army: సలామ్ సైనికా..! అర్ధరాత్రి మంచు కొండల్లో తల్లీబిడ్డను కాపాడిన భారత సైన్యం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలో షర్మిల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మూడు రోజుల పర్యటనలో హస్తినలో బిజీబిజీగా గడిపారు. పార్టీ అగ్ర నాయకత్వంతో సమావేశమై ఏపీలో కార్యాచరణపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 5వ తేదీ నుంచి ఐదు జిల్లాల పర్యటన చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే వరుస పర్యటనలతో షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది.
షర్మిల రాకతో ఫుల్ జోష్‌లోకి వచ్చిన ఏపీ కాంగ్రెస్ పార్టీ రానున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నది. షర్మిల పర్యటనతో నిస్తేజంలో ఉన్న హస్తం పార్టీ శ్రేణులు మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీ వ్యాప్తంగా మళ్లీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో షర్మిల పర్యటనకు సానుకూల స్పందన లభిస్తోంది. ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే నిర్ణయం కోసం పార్టీ కేడర్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. కోలుకున్నాక షర్మిల చేపట్టే పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యవర్గం సిద్ధమవుతున్నది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook