/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

New Friends in NDA: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై వ్యాఖ్యానించడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని ప్రకటించారు. ఫ్యామిలీ ప్లానింగ్‌ కుటుంబపరంగా బాగుంటుందని చెప్పారు. అంటే రాజకీయాల్లో పొత్తులపై హద్దులు పెట్టుకోమని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అందరినీ ఆహ్వానిస్తామని నర్మగర్భంగా తెలిపారు. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని తెలపడం గమనార్హం. ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.

Also Read: Honey Trap: సింగోటం హత్యకేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఇది తల్లీకూతురు నడిపే 'క్రైమ్ కథా చిత్రం'

ఇటీవల అమిత్‌ షాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుయడు కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో అమిత్‌ షాతోపాటు బీజేపీలోని కొందరు ముఖ్యులను కలిశారు. ఏపీ ఎన్నికల్లో బీజేపీతో పెట్టు పెట్టుకోవడానికి చంద్రబాబు తహతహలాడుతున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు చంద్రబాబు వచ్చి కలవడంతో టీడీపీతో కూడా బంధం ఏర్పడుతుందని తెలుస్తోంది. 'కొత్తవారు వస్తున్నారు' అని చెప్పడం వెనుక టీడీపీ కూడా ఎన్డీయేలోకి చేరుతుందని అమిత్‌ షా చెప్పకనే చెప్పారు.

Also Read: Bajrang Dal: ప్రేమికులకు అలర్ట్.. వాలంటైన్స్‌ డే రోజు బయటతిరగొద్దని బజరంగ్ దళ్ హెచ్చరిక

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ.. పలు రాజకీయ అంశాలపై కూడా స్పందించారు. 'ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తారు. కూటమిలోని మిత్రులను మేమెప్పుడూ బయటకు పంపించలేదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లి ఉండవచ్చు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి అంత మంచిదని భావిస్తున్నా' అని తెలిపారు. మూడోసారి రాబోయేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 'ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ముస్లిం సోదరులను సీఏఏకి వ్యతిరేకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. పాక్‌, అఫ్ఘానిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో హింసను ఎదుర్కొని భారత్‌కు వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశం. ఏ ఒక్కరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడం కోసం కాదు' అని వివరణ ఇచ్చారు. సీఏఏ అమలుకు ముందు నియమనిబంధనలను జారీ చేస్తామని తెలిపారు.

రానున్న ఎన్నికలపై స్పందిస్తూ 'సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుంది. మేం ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. అందుకే దేశ ప్రజలు బీజేపీ 370 సీట్లు. మొత్తంగా 400 సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నా. రాహుల్‌ యాత్రపై అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. దేశ విభజనకు కారణమైన ఆ పార్టీ నేతకు ఇలాంటి యాత్ర చేసే అర్హత లేదని స్పష్టం చేశారు. అయోధ్య ఆలయ నిర్మాణం బుజ్జగింపు రాజకీయాలతో ఆలస్యమైందని తెలిపారు.

కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్‌ షా చేసిన వ్యాఖ్యల వెనకాల భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీలన్నీ తిరిగి వస్తాయని పరోక్షంగా చెప్పారు. పాత పార్టీలు రావాలని కోరుకుంటున్నట్లు ఆ వ్యాఖ్యల వెనుక అర్థం దాగి ఉంది. ఏపీలోని టీడీపీ మొదలుకుని అకాలీదళ్‌, శివసేన పార్టీలు ఇప్పుడు మళ్లీ ఎన్డీయేలో చేరుతాయని తెలుస్తోంది. తమిళనాడులోని అన్నాడీఎంకే కూడా ఎన్డీయే కూటమిలో చేరడానికి సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీతో చర్చలు తుది దశకు చేరుకున్నాయి. పన్నీర్‌ సెల్వం మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Amit Shah Says New Friends Will Be Come In NDA at New Delhi Global Business Summit Rv
News Source: 
Home Title: 

AP Politics: పొత్తులపై అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు.. టీడీపీని చేర్చుకుంటారా లేదా అనేది ఉత్కంఠ

AP Politics: పొత్తులపై అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు.. టీడీపీని చేర్చుకుంటారా లేదా అనేది ఉత్కంఠ
Caption: 
Amit Shah Key Comments On NDA Alliance (Source: File
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AP Politics: ఏపీలో పొత్తులపై అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు.. టీడీపీని చేర్చుకుంటారా లేదా?
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Saturday, February 10, 2024 - 21:08
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
29
Is Breaking News: 
No
Word Count: 
387