AP Politics: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో సమూల మార్పులు చేస్తున్నారు. అభ్యర్ధుల్ని అటూ ఇటూ మార్చడం లేదా కొందరిని పక్కనబెట్టడం చేస్తున్నారు. ఈ క్రమంలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. కొందరు దూరంగా ఉంటే కొందరు పార్టీ వీడుతున్నారు.
ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ వీడగా తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు ఈయనకు పొసగకపోవడంతో పాటు ఇతర సామాజిక కారణాలతో అనిల్‌ను నరసరావుపేట ఎంపీ స్థానానికి పంపిస్తున్నారు. ఇక నెల్లూరు లోక్‌సభ నుంచి వేమిరెడ్డిని పోటీ చేయాలని జగన్ కోరగా అయిష్టంగానే అంగీకరించారు. అదే సమయంలో నెల్లూరు సిటీ స్థానం తన భార్యకు కేటాయించాలని వేమిరెడ్డి కోరినట్టు సమాచారం. కానీ అనూహ్యంగా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ను ఇన్‌ఛార్జ్‌గా వైఎస్ జగన్ ప్రకటించారు. ఎండీ ఖలీల్ పేరును అనిల్ కుమార్ యాదవే ప్రతిపాదించినట్టు సమాచారం.
ఈ పరిణామాలతో వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చెన్నై వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కన్పించడం లేదు. దాంతో ఇప్పుడు పార్టీకు నెల్లూరులో కొత్త తలనొప్పి ప్రారంభమైంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్ధికంగా బలమైన నేత, పార్టీకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. అందుకే జగన్ ఈయనను రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు ఆయన ఆశించినట్టు తన భార్యకు కాకుండా మరొకరికి నెల్లూరు సిటీ కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. మరో పార్టీలో చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి.
Also read: AP Railway Projects: ఎన్నికల వేళ ఏపీ రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook