Janasena: పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత..

Janasena: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో కొన్ని నెలలు మాత్రమే మిగిలి వుంది. దీంతో రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులతో పాటు తమ వ్యూహ చతురతకు పదను పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయా పార్టీల్లో చేరి తమ సీటును పదిలం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 29, 2024, 01:13 PM IST
Janasena: పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత..

Janasena: సార్వత్రిక ఎన్నికల వేళ వివిధ పార్టీల్లో చేరికలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలుగు దేశం, వైసీపీ పార్టీలు ఆయా ప్రాంతాల్లోని ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకునే ప్రణాళికలు రచిస్తున్నాయి. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే పార్టీలోకి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ కోవలో ప్రముఖ నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. కే ఎల్ పి మూవీస్ సంస్థ అధినేత IQ మూవీతో నిర్మాతగా మరియు వ్యాపారవేత్త అయినటువంటి కాయగూరల లక్ష్మీపతి నేడు (సోమవారం) జనసేన పార్టీలో చేరారు. ఈయన తండ్రి గారైన కీర్తి శేషులురీ కె. నారాయణస్వామి గారు టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి స్ఫూర్తితో ఈయన కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరారు.

గతంలో ఈయన ఆర్టిఏ (RTA) బోర్డు మెంబర్ గా.. టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా.. అనంతపురం పట్టణ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు సేవ చేసిన వ్యక్తి. అనంతపురం లో ప్రభుత్వ స్థలములో శాశ్వత ఆర్ టి ఓ కార్యాలయమును నిర్మించుటకు కృషిచేసారు. టెలికం ఎస్ టి డి, ఐ ఎస్ డి కమిటీ మెంబర్ గా పని చేసిన కాలంలో పార్టీ కార్యకర్తలకు ఎస్.టి.డి బూతులు కేటాయించి బ్యాంకు రుణాలు ఇప్పించారు. కె ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు దుప్పట్లు.. చేతి కర్రలు పంచారు. అంతేకాదు పలు గ్రామాల్లో మంచి నీళ్ల   నీళ్ల ట్యాంకు నిర్మాణం చేసారు. అదేవిధంగా అఖిలభారత కాపు సమాఖ్య నందు ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. మరోవైపు కాపు, బలిజల సంఘాల కోసం రాష్ ట్రవ్యాప్తంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా కాయగూరల లక్ష్మీపతి నిలిచారు. నేడు ఈయనకు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  

ఈ సందర్భంగా కాయగూరలు లక్ష్మీపతి మాట్లాడుతూ : పవన్ కళ్యాణ్  అంటే అభిమానంతో గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో పాల్గొనడం జరిగింది. సినిమా అంటే ఇష్టంతో IQ అనే సినిమాతో నిర్మాతగా రంగ ప్రవేశం చేశాను. ఇంకా రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. సినిమాలంటే ఎనలేని ఇష్టం. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ లభిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బిజినెస్ రంగంలో నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. సినిమాలు నిర్మిస్తూనే పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో జనసేన పార్టీలో జిల్లాలో ఎక్కడ పొత్తు మీద స్థానం ఇచ్చిన నా వంతు కృషి చేస్తూ పార్టీ గెలుపు కోసం  కోసం కృషి చేస్తాన్నారు. పవన్ కళ్యాణ్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అంతేకాదు రాబోయే పార్టీ టికెట్ కేటాయిస్తే.. ఎమ్మెల్యేగా గానీ.. ఎంపీగా పోటీ చేసేందకు రెడీ అంటున్నారు.

ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..

ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News