AP Elections: ఏపీలో సినీ ప్రముఖుల ప్రచారం.. ఫలితాలపై జోష్యం చెప్పిన 'థర్టీ ఈయర్స్‌ ఇండస్ట్రీ' పృథ్వీ

Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్‌ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 10, 2024, 10:08 PM IST
AP Elections: ఏపీలో సినీ ప్రముఖుల ప్రచారం.. ఫలితాలపై జోష్యం చెప్పిన 'థర్టీ ఈయర్స్‌ ఇండస్ట్రీ' పృథ్వీ

Jani Master Prudhvi Campaign: కొన్నేళ్ల కిందట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా ఉన్న పృథ్వీ ఓ నామినేటెడ్‌ పోస్టులో కూడా కొనసాగాడు. అయితే ఆయన చేసిన ఓ వివాదాస్పద 'పని' వలన అతడి పదవి పోవడమే కాకుండా వైసీపీ నుంచి కూడా బయటకు వచ్చేలా దారి తీసింది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటూ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాడు. తాజాగా నంద్యాలలో పర్యటించాడు. 'జనసేన కోసం మెగా సైన్యం' పేరిట జరిగిన ఓ కార్యక్రమంలో పృథ్వీ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Bajrang Dal: ప్రేమికులకు అలర్ట్.. వాలంటైన్స్‌ డే రోజు బయటతిరగొద్దని బజరంగ్ దళ్ హెచ్చరిక

ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరో జోష్యం చెప్పాడు. సీట్ల లెక్కతో సహా వివరించాడు. 'వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ- జనసేన పార్టీ కూటమి 136 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుంది' అని ప్రకటించాడు. 'డైమండ్‌ రాణిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈసారి ఆమెకు కూడా టికెట్‌ రాదు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తాం. పోలవరం గేట్ల గురించి తెలియని అంబటి రాంబాబుకు ఈసారి టికెట్‌ లేదు. ఆయన మంత్రిగా కన్నా డిస్ట్రిబ్యూటర్‌గా పనికొస్తాడు' అని పేర్కొన్నాడు.

Also Read: Honey Trap: సింగోటం హత్యకేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఇది తల్లీకూతురు నడిపే 'క్రైమ్ కథా చిత్రం'

సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూ 'పాదయాత్ర చేసిన చెల్లికి, తల్లికి న్యాయం చేలేని జగన్‌ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు' అని నిలదీశారు. 'నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూనే వారికి ఉన్న 26 పథకాలు సీఎం జగన్‌ తీసేశాడు' అని ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తీ వరకు ఎవరినీ అడిగినా ఇంత అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని చెబుతారని పృథ్వీ తెలిపాడు. సీఎం జగన్‌ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పృథ్వీ తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే జనసేన మద్దతు ఇచ్చిందని చెప్పారు.

కొరియోగ్రాఫర్‌ జానీ ప్రచారం
జనసేన పార్టీలో చేరిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ నెల్లూరులో పర్యటించాడు. వైసీపీ నాయకులు పవన్‌ కల్యాణ్‌ జోలికి వస్తే తాటతీస్తామని హెచ్చరించారు. టీడీపీ హయాంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని ఆరోపించారు. వైసీపీ వేస్తున్న 'సిద్ధం' ఫ్లెక్సీలకు డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారని నిలదీశారు. వైసీపీ నేతల భవనాలు కళకళలాడుతుంటే పేదలు ఇళ్లు లేక బాధపడుతున్నారని తెలిపారు. జగనన్న ఇళ్లల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. జనసేన సైనికులంటే ప్రాణాలు పణంగా పెడతారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతానని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News