AP Elections 2024: అధికార పార్టీకి ఎదురుదెబ్బ.. గుంటూరు జిల్లాలో కీలక నేత టీడీపీలోకి జంప్

AP Politics: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఏపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో సీట్లు దక్కని నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన యువ నేత భరత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 26, 2024, 01:24 PM IST
AP Elections 2024: అధికార పార్టీకి ఎదురుదెబ్బ.. గుంటూరు జిల్లాలో కీలక నేత టీడీపీలోకి జంప్

AP Politics: ఏపీలో రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తమకు టిక్కెట్లు దక్కవనుకుంటున్న వారు అధికార పార్టీలో ఉంటే ప్రతిపక్షానికి ప్రతిపక్ష పార్టీలో ఉంటే అధికార పార్టీలోకి, ఇవేవీ కుదరవు అనుకుంటే జనసేన, కాంగ్రెస్‌లో సైతం చేరడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఎమ్మెల్యేలు సైతం టికెట్లు రావు అనుకుంటే ముందు ఆప్షన్‌గా టీడీపీ తర్వాతి ఆప్షన్‌గా జనసేన ఆ తర్వాత కాంగ్రెస్ వంటి పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది టికెట్లు రాని ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు ఆసక్తి కనబరుస్తూ ఉండగా.. టీడీపీ కూడా టికెట్ ఇస్తామని చెప్పకుండా పార్టీ గెలిస్తే మంచి బాధ్యతలు ఇస్తామని చెబుతూ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల అధికార పార్టీ తెలుగుదేశం నుంచి ఫిరాయించిన వారికి టికెట్లు ఇస్తూ ఉండటం కూడా హాట్ టాపిక్ అవుతోంది.

తాజాగా గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ యువనేత, స్విమ్స్ కాలేజీ అధినేత భరత్‌రెడ్డి రాజీనామా చేశారు. టీడీడీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలో యూత్‌లో మంచిపట్టు ఉన్న భరత్‌రెడ్డి.. ఎన్నికల వేళ రాజీనామా చేయడం అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన్నట్లు అయింది. బాపట్ల, గుంటూరు వెస్ట్ టికెట్ ఇస్తామన్నా.. వైసీపీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో భరత్‌రెడ్డికి మంచిపేరు ఉంది. 

టీడీపీ నేత బేబి నాయనతో కలిసి నారా లోకేశ్‌ను కలిశారు. HIV బాధిత 9 మంది చిన్నారులను దత్తత తీసుకుని.. వారికి పోషకాహార అవసరాలను చూసుకుంటున్నారు. ఏడేళ్ల అంధ, చెవిటి బాలికను దత్తత తీసుకుని ఆమెకు వైద్య, పోషకాహార అవసరాలను అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెడికల్, డెంటల్ క్యాంపులు, ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించి.. మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో కూడా అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. దుగ్గిరాల మండలానికి చెందిన కీలక నేతలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉండవల్లిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు జరిపిన చర్చల్లో తమకు జరిగిన అన్యాయంపై చెప్పుకున్నట్లు తెలిసింది. టీడీపీలోకి దుగ్గిరాల మాజీ జెడ్పీటీసీ, మాజీ జిల్లా మహిళ అధ్యక్షురాలు యేళ్ళ జయలక్ష్మి, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, యడ్ల వెంకటరావులతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, ముఖ్య నేతలు చేరేందుకు రెడీ అవుతున్నారు. 

Also Read: MP Bandi Sanjay: ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి.. ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి: బండి సంజయ్

Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ... ప్రపంచంలో ఒకే ఒక్కడు..

అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News