Punganuru Violence Case: పలమనేరు డి.ఎస్పీ సుధాకర్ రెడ్డి ఇంచార్జ్, సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ సందర్భంగా సబ్ అడిషనల్ ఎస్పీ కే లక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రోడ్ షోను పుంగనూరు టౌన్ కు మళ్లించడానికి ముందుగా రొంపిచర్లలో 4వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను ప్రేరేపించాడని పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపాడని అన్నారు.
YS Avinash Reddy's pressmeet: పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Chandrababu Pulivendula Tour: రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని సిఎం జగన్ నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పుడు రాష్ట్రమే రివర్స్ లో ఉంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మనకు ఇచ్చిన వరం పోలవరం. నేను పట్టుకుంటే ఉడుము పట్టే. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు.
Volunteer Arrested in Forgery Case: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలనే దురుద్దేశంతో ఆయా పథకాలకు అవసరమైన ధృవపత్రాల స్థానంలో నకిలీ ధ్రవపత్రాలు తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ఉదంతం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది.
Niti Aayog Team meets AP CM YS Jagan: నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధతో పాటు పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్‌లతో కూడిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు.
YSR Nethanna Nestam Scheme: నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడానికి అప్పటి చంద్రబాబు నాయుడి పరిపాలనే కారణం అని వైఎస్ జగన్ ఆరోపించారు. నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి.. చివరికి చేనేతలను మోసం చేశారు అని మండిపడ్డారు.
Pawan Kalyan About His Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. అందుకోసం జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా తాను సిద్ధంగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మీరు ప్రాసిక్యూషన్ చేస్తాననగానే తానేమీ భయపడనని.. తాను ప్రాసిక్యూషన్ ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
AP, Telangana Rains: మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరిలోకి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది అని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ముందస్తుగా వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
Jagan Anna Thodu Scheme Money: జగనన్న తోడు పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ. 549.70 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,87,492 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలు కింద రూ. 2,955.79 కోట్లు అందించినట్టు ఏపీ సర్కారు స్పష్టంచేసింది.
Second Pension In One Family: ప్రస్తుతం ఏపీలో ఒక రేషన్ కార్డు కింద ఒకరికే పెన్షన్ అందుతోంది. త్వరలో కుటుంబంలో రెండో వ్యక్తికి పెన్షన్ అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాలంటీర్లతో సర్వే నిర్వహిస్తున్నారు.
AP Govt: టమాటా ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న రాష్ట్రప్రజలకు భారీ ఊరట కల్పించింది ఏపీ ప్రభుత్వం. రైతు బజార్లలో కిలో రూ.50కే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు రైతుబజార్ల వద్ద బారులు తీరుతున్నారు.
AP New DGP News: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏసీబి డీజీగా నియమితులైన కెవి రాజేంద్రనాధ్ రెడ్డి గత 16 నెలలుగా ఇన్‌ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వం కసిరెడ్డిని డీజీపీగా నియమించింది.
Ambati Rambabu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతోంది అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అంటే ఏంటో తెలీదు.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని అంబటి రాంబాబు తేల్చేశారు.
AP Cabinet Today Meeting Highlights: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. వివిధ శాఖల్లో 6,840 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలైజేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Contract Employees Regularization in AP: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన ప్రభుత్వం.. ఈ మేరకు క్రమబద్ధీకణకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్వర్వులు వెలువడనున్నాయి.
AP govt Employees Problems: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాల్లో కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారు.
న్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడే అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు పలు కీలక సూచనలు చేశారు. అవేంటంటే..
AP Govt starts E-Chits: అమరావతి, మే 15 : చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుండి “ఇ-చిట్స్” సేవలను అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. సంబందిత నూతన ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను వెలగపూడి ఆంద్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి సోమవారం లాంఛనప్రాయంగా ప్రారంభించారు.
YSR Matsyakara Bharosa Scheme News: రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ప్రతీ ఏడాది వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది.
హజ్‌యాత్రపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష మండిపడ్డారు. ధరలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.